బరువెక్కువయ్యిందని 19మంది ప్రయాణికులను వదిలేసి.. టేకాఫ్ అయిన విమానం..
ఈజీ జెట్ విమానంలో బరువు ఎక్కువయ్యిందని 19మంది ప్రయాణికులను దింపేసి వెళ్లిన ఘటన జూలై 5న జరిగింది.
లాంజారోట్ నుండి లివర్‌పూల్‌కు వెడుతున్న ఈజీజెట్ విమానంలో 19 మంది ప్రయాణికులను విమానం టేకాఫ్ కు ముందే దింపేశారు. కారణం ఏంటంటే.. టేకాఫ్ అవ్వడానికి ఆ 19మంది బరువయ్యారట. విచిత్రంగా అనిపిస్తున్న ఈ ఘటన నిజంగా జరిగింది. బుధవారం జూలై 5న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇండిపెండెంట్ కథనం ప్రకారం జెట్ విమానం ఎగరడానికి ముందు.. బరువు ఎక్కువయ్యిందని 19మంది ప్రయాణికులను దిగాల్సిందిగా సూచించారు. విమానం రాత్రి దాదాపు 9.45 గంటలకు టేకాఫ్ అయ్యింది. కానీ వాతావరణం బాగా లేకపోవడం.. విమానం బరువు ఎక్కువవ్వడం లాంటి కారణాలతో ఆలస్యం అయింది.
ఏ ప్రయాణీకులు "విమానంలోంచి దిగడానికి ఇష్టపడతారో" స్వచ్ఛందంగా చెప్పాలని కోరారు. ఆ తరువాత విమానం చివరకు 11:30కి బయలుదేరింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పైలట్ విమానంలో ఉన్న ప్రయాణికులకు పరిస్థితిని వివరిస్తున్నట్లు చూడవచ్చు.
మందులు వేసుకోవాల్సి వస్తుందని, మర్మాంగం కోసుకుని.. వైద్య విద్యార్థి ఆత్మహత్య.. !
అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసినట్లుగా కనిపించే వీడియో, పైలట్ పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు చూపిస్తుంది. “విమానం ఎక్కడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రయాణికులు చాలామంది ఉన్నారు. మాకు కేటాయించిన విమానం ఇంతమంది ప్రయాణికులను మోయలేదు.
"ఆ భారీ విమానం ఇక్కడ లాంజరోట్‌లో చాలా చిన్న రన్‌వే ఉంది. ప్రస్తుతానికి పూర్తిగా అనుకూలంగా లేని కొన్ని గాలులు, లాంజరోట్‌లోని ప్రస్తుత పర్యావరణ పరిస్థితులతో, విమానం బయలు దేరడానికి ఈ సమయంలో ఎక్కువ బరువు అవుతోంది’’ అతను తెలిపాడు.
గాలుల పరిస్థితి, ప్రయాణికుల భద్రతలేప్రధాన ప్రాధాన్యతల వల్ల కొంతమంది ప్రయాణీకులు డీబోర్డ్ చేయకుండా విమానం ఏ విధంగానూ టేకాఫ్ చేయలేమని పైలట్ వివరించారు. ఇలా చేయడానికి ఇంకా అనేక కారణాలున్నాయన్నారు..
పైలట్ మాట్లాడుతూ... ‘విమానం చాలా వేడిగా ఉంది, గాలి సరిగా లేదు, విమానం వెళ్లడానికి దిశ కూడా సరిగాలేదు. మరిప్పుడేలా..? అని మీరు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు.. అందుకే నేను మీకొకటి చెప్పడానికి వచ్చాను. మా కార్యకలాపాల టీంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాం. విమానంలో సాధ్యమైనంత తక్కువ బరువు ఉంటే ఈ సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది" అన్నారాయన.
దీనికోసం స్వచ్ఛందంగా విమానం నుంచి ఎవరు దిగిపోతారో వారినే చెప్పాలని అభ్యర్థించారు. పరిహారంగా, విమానయాన సంస్థ తమ ప్రయాణాన్ని మానుకున్నందుకు ప్రతి ప్రయాణికుడికి 500 యూరోల వరకు ప్రోత్సాహకాలను అందజేస్తుందని ఆయన ప్రకటించారు.
ఈజీ జెట్ప్రతినిధి ఇండిపెండెంట్‌కి ఒక ప్రకటనలో ఇలా అన్నారు, “నిన్న సాయంత్రం లాంజరోట్ నుండి లివర్‌పూల్‌కు EZY3364 విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు వాతావరణ అననుకూల పరిస్థితులవల్ల.. బరువు పరిమితిని మించి ఉన్నందున విమానంలో ప్రయాణించకుండా ఉండడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలుపుతున్నాం. ఈ పరిస్థితులలో ఇది సాధారణ కార్యాచరణ నిర్ణయం, భద్రతా కారణాల దృష్ట్యా అన్ని విమానయాన సంస్థలకు బరువు పరిమితులు అమలులో ఉన్నాయి.
"ఫ్లైట్ బరువు పరిమితులను మించిపోయిన సందర్భంలో, ప్రయాణీకులను తరువాతి విమానానికి ఉచితంగా పంపడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నాం. వాలంటీర్లకు నిబంధనలకు అనుగుణంగా పరిహారం అందించబడుతుంది" అని ప్రతినిధి చెప్పారు.