Asianet News TeluguAsianet News Telugu

తాగితే ఇలా ఉంటుందా?.. నాగుపాముతో తందనాలు, బుట్టబొమ్మతో స్టెప్పులు...(వీడియో)

తాగిన తరువాత కొన్నిసార్లు ఈ మందు బాబులు చేసే చేష్టలు చాలాసార్లు విచిత్రంగా, వినోదంగా ఉంటాయి. కొంతమంది తాగితే ఏదేదో వాగుతుంటారు. మరికొంతమంది కామ్ గా పడుకుంటారు. కానీ ఇంకొంతమంది ఇదిగో ఇప్పుడు మనం చదవబోయే ఘటనల్లా ప్రవర్తిస్తూ వైరల్ గా మారతారు. టాక్స్ పేయర్స్ కి చెడ్డపేరు తెస్తుంటారు. చూసేవారికి కాస్త వినోదాన్ని కూడా పంచుతారనుకోండీ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే...

drunken beggar tie snake around the neck, and another man dancing with doll
Author
Hyderabad, First Published Dec 4, 2021, 8:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ : తాగితే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని వాళ్లూ వీళ్లూ చెప్పడమే తప్ప.. నిజానికి ఎలా ఉంటుందో తాగినవాడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. అందుకే తాగితే ఒళ్లూ పై తెలియదట... విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో కూడా గమనించుకోలేరట.. మరి అప్పుడు ఆ తప్పు మందుదు కానీ.. అది తాగిన మనిషిది కాదు కదా.. ఇది మందుబాబులు చెప్పుకునే సమర్థన..

తాగిన తరువాత కొన్నిసార్లు ఈ మందు బాబులు చేసే చేష్టలు చాలాసార్లు విచిత్రంగా, వినోదంగా ఉంటాయి. కొంతమంది తాగితే ఏదేదో వాగుతుంటారు. మరికొంతమంది కామ్ గా పడుకుంటారు. కానీ ఇంకొంతమంది ఇదిగో ఇప్పుడు మనం చదవబోయే ఘటనల్లా ప్రవర్తిస్తూ viral గా మారతారు. Taxpayers కి చెడ్డపేరు తెస్తుంటారు. చూసేవారికి కాస్త వినోదాన్ని కూడా పంచుతారనుకోండీ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే...

ట్రాన్స్ జెండర్లని పెళ్లికి పిలిచిన మెగా కోడలు ఉపాసన.. సర్వత్రా ప్రశంసలు.. ఫోటోలు వైరల్‌

తెలంగాణలో శుక్రవారం ఓ వింత ఘటన జరిగింది. రామచంద్రాపురంలోని భారతీనగర్ చౌరస్తాలో ఓ యువకుడు neckలో ఆరడుగుల snakeను వేసుకుని ప్రజలను బెదిరించడం మొదలుపెట్టాడు. అంతేకాదు డబ్బులు వసూలు చేస్తూ నానా హంగామా సృష్టించాడు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. అలా దాదాపు గంటకు పైగా ఆ యువకుడు పాముతో ప్రజల్ని భయబ్రాంతులు చేశాడు. 

ఇతను బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని దేవాలయం ముందు Begging చేసేవాడిగా స్థానికులు గుర్తించారు. సదరు అపర శివుడి పేరు మహేష్ అట.. అలాగని అతని పేరులో వైబ్రేషన్స్ ఏమీ లేవు లెండి. ఇంతకీ ఇలా చిందులు వేయడానికి కారణం ఏంటీ అంటే.. బాబు ఫుల్ గా బాటిల్ ఎక్కించాడట.. ఆ తరువాత పాము కనబడింది. ఇంకేం మెడలో వేసుకుని బయల్దేరాడు..

అలా బెల్ టౌన్ షిప్ లోపలి నుంచి ఎల్ఐజీ చౌరస్తా వరకు వచ్చాడు. రోడ్డుమీద అందర్నీ బెదిరిస్తూ, డబ్బులు అడగడం మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పాములు పట్టేవాళ్లకు సమాచరం ఇచ్చారు. వాళ్లు వచ్చి మహేష్ మెడలో ఉన్న పామును పట్టుకున్నారు. అప్పటికే మహేష్ చేష్టలతో కోపంతో రగిలిపోతున్న స్తానికులు అతని మీద దాడికి దిగారు. పోలీసులు మహేష్ ను వారినుంచి తప్పించి స్టేషన్ కు తరలించారు. అయితే ఇది మద్యం తప్పుకానీ... మహేష్ తప్పు కాదు అనుకున్న పోలీసులు అతని మీద ఎలాంటి కేసూ నమోదు చేయలేదని తెలిపారు. అదీ ట్విస్ట్...

ఇలాంటిదే ఇంకో ఘటన. కాకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరో మందుబాబు పొద్దుపొద్దున్నే ఫుల్ గా వేశాడు. ఓ పెళ్లికి వెళ్లాడు. ఇంకేముంది అక్కడి డీజేకు లోపలున్న మందు పనిచేయడం మొదలుపెట్టింది. ఫంక్షన్ హాల్ గేటు ముందు స్వాగతం కోసం పెట్టిన బొమ్మ కనిపించింది. అది అమ్మాయి అనుకున్నాడో ఏమో.. దాన్ని పట్టుకుని చిరంజీవి లెవల్లో తెగ డ్యాన్స్ మొదలుపెట్టాడు.

అక్కడున్నవారు అది చూసి నవ్వుకోవాలో.. అతడిని ఆపాలో తెలియక తంటాలు పడ్డారు. చివరికి పదిమంది వచ్చి లాగితే కానీ బొమ్మను వదలలేదా నటరాజు.. ఇది కూడా అతని తప్పు కాదు.. అతని లోపలున్న మందుది కానీ..!...ఆ వీడియో కూడా చూసేయండి. 

"

Follow Us:
Download App:
  • android
  • ios