ప్రేమికుల రోజు మరెన్ని రోజులే లేవు. ఇప్పటికే వాలంటైన్ వీక్ ప్రారంభమైంది కూడా. ఇప్పటికే యువతీ యువకులంతా తమ ప్రేమికులకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అంటూ తెగ ఆలోచిస్తూ ఉండి ఉంటారు. అయితే... డామినోస్ పిజ్జా అలాంటివారి కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చక్కగా.. డామినోస్ ఇస్తున్న పిజ్జా డైమండ్ రింగ్  ని గెలుచుకొని మీ వాలంటైన్ కి అది బహుమతిగా ఇచ్చేయండి. డామినోస్ పిజ్జా రింగ్ ఇవ్వడమేంటి అనుకుంటన్నారా... 

ఇంతకీ మ్యాటరేంటంటే...  ఈ సంవత్సరం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా డామినోస్ పిజ్జా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘ వన్ లక్కీ పిజ్జా లవర్’ పేరిట ఓ కస్టమర్ రింగ్ బహుమతిగా ఇవ్వనుంది. ఇది డైమండ్ రింగ్ కాగా.. పిజ్జా ఆకారంలో ఉంటుంది. దాని మీద చీస్, పెప్పరోనీ షేప్ లో రూబీస్ కూడా ఉన్నాయి. ఫోటోలో చూస్తే.. మీకు ఉంగరం ఎలా ఉంటుందో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది.

Also Read పెళ్లిలో వధువు అదిరిపోయే స్టెప్పులు.. వరుడి సంగతేమోకానీ, నెటిజన్లు ఫిదా...

దీని ఖరీదు 9వేల డార్లు కాగా.. మన భారత కరెన్సీలో రూ.6లక్షలా 42వేలకు పైమాటే. దీనిని ఒక క్యారెట్ డైమండ్ తో తయారు చేశారు. ఈ ఉంగరం గెలవాలంటే ఒక చిన్న కాంపిటేషన్ లో గెలవాల్సి ఉంటుంది.

మీ రొమాంటిక్ ఎంగేజ్మెంట్ లో డామినోస్ పిజ్జాని జతచేసి ఓ 30సెకన్ల వీడియో తయారు చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ పోటీలు ఫిబ్రవరి 12వ తేదీతో ముగిసిపోతుంది. ఈ లోపు ఓ అద్భుతమైన వీడియో తీసి వాళ్లకు పంపాల్సి ఉంటుంది. ఆ వీడియో కనుక వాళ్లకు నచ్చేస్తే.. ఆ పిజ్జా ఉంగరం మీ సొంతమౌతుంది. కాకపోతే.. ఈ ఆఫర్ మన దేశంలో కాదు.. ఆస్ట్రేలియాలో కావడం గమనార్హం. కాగా... ఆస్ట్రేలియా డామినోస్ పిజ్జా ఈ ఎనౌన్స్ మెంట్ ఇచ్చినప్పటి నుంచి ట్విట్టర్ లో రకరకాల కామెంట్స్, మీమ్స్ పుట్టుకొస్తుండటం విశేషం.