జంతువులు వింత వింత పనులు చేసి అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.  ఈ చేష్టలు కూడా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. తాజాగా ఓ కుక్క చేసిన పని నెట్టింట్లో చక్కర్లు కొండుతోంది.

బర్రెలు, ఆవుల గుంపులో ముందుగా నడుచుకుంటూ వస్తున్న బర్రెపై కుక్క కూర్చొంది. ముందు, కుడి, ఎడమ వైపుల్లో మరో మూడు కుక్కలు బాడీ గార్డుల్లా.. చుట్టూ ఉన్న మిగిలిన బర్రెలు, ఆవులు రక్షణ కవచాల్లా దానితో పాటు ముందుకు నడుస్తూ వచ్చాయి.

బర్రెపై వున్న ఆ కుక్క తననో రాజు గారిలా ఫీలైందో ఏమో కానీ కిందకు దిగలేదు. నేలపై, చుట్టుపక్కల వారిని చూసుకుంటూ ముందుకు అలా సాగిపోయింది. ఈ వింత సంఘటనను దాది చంద్రో తోమర్ అనే వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.