మూత్రాశయంలో ఫోన్ ఛార్జర్... పురుషాంగం నుంచి బలవంతంగా నెట్టి...

అది అతని మూత్రాశయంలోకి ఎలా వచ్చిందో తెలుసా..? అతనే పనిగట్టుకొని తన పురుషాంగంలోకి బలవంతంగా నెట్టుకోవడం గమనార్హం. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

Doctors remove cell phone charging cable from man's urinary bladder

పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. ఇలా పెద్దలు ఎందుకన్నారో.. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే అర్థమౌతుంది. మన సమాజంలో చాలా వింత సంఘటనలు చోటుచేసుకుంది. ఆ సంఘటనలు చూస్తే... ఇలా కూడా చేస్తారా అనే సందేహం కలగకుండా ఉండదు. అలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఓ వ్యక్తి మూత్రాశయంలో ఫోన్ ఛార్జర్ ని గుర్తించారు వైద్యులు. అది అతని మూత్రాశయంలోకి ఎలా వచ్చిందో తెలుసా..? అతనే పనిగట్టుకొని తన పురుషాంగంలోకి బలవంతంగా నెట్టుకోవడం గమనార్హం. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గువాహటికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. తాను పొరపాటున మొబైల్ ఛార్జర్ కేబుల్‌ను తిన్నట్లు వైద్యుడికి వివరించాడు. దీంతో మొదట అతనికి ఎండోస్కోపీ చేయగా.. అతని కడుపులో కేబుల్ కనిపించలేదన్నారు. అయితే ఎక్స్‌రే తీయడంతో అతని మూత్రాశయంలో ఛార్జర్ వైర్ చూసి షాక్ అయినట్లు పేర్కొన్నారు.

వైద్యులను తప్పుదారి పట్టించేందుకు ఆ వ్యక్తి అబ్ధం చెప్పినట్లు వైద్యుడు తెలిపారు. తన పురుషాంగం ద్వారా కేబుల్ వైరస్‌ను చొప్పించుకున్నాడని తెలిపారు. అలాగే అతని మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలున్నాయన్నారు. కాగా మొత్తానికి శస్త్ర చికిత్స చేసి కేబుల్‌ను బయటకు తీశామని ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని డాక్టర్ ఇస్లాం తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios