మహిళ కడుపులో నాలుగు అడుగుల పాము.. ఎలా బైటికి తీశారో చూస్తే షాక్..
ఓ మహిళ కడుపులోనుంచి నాలుగు అడుగుల పాము బైట పడింది. దాన్ని బైటికి తీసిన డాక్టర్లు షాక్ అయ్యారు.
రష్యా : ఆపరేషన్ చేసినప్పుడు కడుపులో కత్తెర్లు, దూదీ, సూదులు పెట్టి మరిచిపోవడం.. ఆ తరువాత వారికి అస్వస్థత రావడంతో విషయం వెలుగులోకి రావడం వింటూనే ఉంటాం. కొన్నిసార్లు.. కడుపులో బల్ల పెరుగడం.. కిలోలకొద్దీ ట్యూమర్లు పెరగడం చూస్తాం.. ఇంకొన్ని వార్తల్లో కడుపులో వెంట్రుకల ఉండలు దొరికిన సందర్భాలూ ఉన్నాయి. అయితే వీటన్నింటికీ భిన్నమైన.. షాకింగ్ ఘటన ఒకటి రష్యాలో వెలుగుచూసింది.
రష్యాకు చెందిన ఓ మహిళకు ఇటీవల గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా కడుపు నొప్పి వచ్చింది. అంతలోనే స్పృహతప్పి పడిపోయింది. ఏం జరిగిందో ఏమో అని కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. వెంటనే ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లకు కూడా విషయం అర్థం కాలేదు. దీంతో పలు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు డాక్టర్. ఆమె కడుపులో సుమారు నాలుగు అడుగుల పాము ఉండటాన్ని గుర్తించారు. చివరికి అతి కష్టం మీద ఆమె నోటి ద్వారా దాన్ని బయటకు తీశారు.
ఈ స్కూల్ పిల్లలు రెండు చేతులా రాస్తారు.. ఐదు భాషల్లోనూ ప్రావీణ్యం.. (వీడియో)
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… బయటకు తీసిన తర్వాత కూడా ఆ పాము బతికే ఉండటం. అది చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ వీడియో చూసి భయపడుతుంటే.. మరి ఇంకొందరు ఇది ఎలా సాధ్యం అవుతుందని ఆశ్చర్యపడుతున్నారు.
మనలో మన మాట అసలు ఆ మహిళ కడుపులోకి పాము ఎలా వెళ్లింది? కడుపులోనే పెరిగితే ఆమెకు ఇన్ని రోజులు తెలియలేదా? ఒకవేళ నోట్లోనుంచి వెడితే.. వెళ్లే టైంలో ఆమెకు స్పృహ లేదా.. ఏలా జరిగింది? ఇలాంటి అనుమానాలన్నీ ఈ వీడియో చూసిన అందరికీ మామూలుగా వచ్చే అనుమానాలే. దీనికి సమాధానాలు ఆ డాక్టర్లో, ఆ మహిళో మాత్రమే చెప్పగలదు.