సాధారణంగా బొద్దింక కనిపిస్తేనే కొందరు వణికిపోతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, అమ్మాయిలైతే వాటికి దూరంగా జరిగి, చెవులు చిల్లులు పడేలా గోల చేస్తారు. అదే ఏకంగా అమ్మాయి చెవిలోనే బొద్దింక గూడు కట్టేసుకుంటే.. వినడానికే ఒళ్లు గగుర్పోడుస్తోంది.

చైనాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఓ అమ్మాయికి చెవిలో ఎప్పుడు దూరిందో ఏమో తెలియదు గానీ ఓ బొద్దింక నానా యాతన పెట్టింది. దాని చర్యలతో ఆమెకు అప్పుడప్పుడు నొప్పిగా అనిపించేది కానీ.. మామూలే అని వదిలేసింది.

ఇయర్ బడ్స్‌తో శుభ్రం చేసుకునేది. అయితే ఆ అమ్మాయికి రాను రాను చెవిలో నొప్పి ఎక్కువైంది. చివరికి ఆమె డాక్టర్‌ను సంప్రదించగా అసలు విషయం వెలుగు చూసింది. ఆ అమ్మాయి చెవిలో బొద్దింక ఉన్నట్లు తెలిసింది.

ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బొద్దింక ఇంకా బతికే ఉండటం. ఇక ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని గ్రహించిన వైద్యులు.. ఒటోస్కోప్ విధానం ద్వారా ఎట్టకేలకు ఆ అమ్మాయి చెవిలో నుంచి బొద్దింకను బయటకు తీశారు.

బొద్దింక కనుక ఇంకొద్ది రోజులు చెవిలోనే ఉంటే.. కర్ణభేరీకి రంద్రం చేసి తలలోకి ప్రవేశించేదని చెప్పారు. ఆ అమ్మాయి నిద్రపోయే సమయంలో బొద్దింక చెవిలో దూరి వుండొచ్చని అభిప్రాయపడ్డారు.

కాగా... ఇళ్లలో తరచుగా క్రిమికీటకాలు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చెవిలో ఏదైనా ఉందనే సందేహం కలిగినప్పుడు సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించాలని చెబుతున్నారు.