మన దేశంలోని ప్రతి ఒక్కరూ.. ప్రతి ప్రాంతం వారు జరుపుకునే పండగ వినాయక చవితి. అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులపాటు ఈ వేడుకను నిర్వహిస్తాం. అయితే.. ఓ ముస్లిం దేశంలోనూ గణేశుడికి ప్రత్యేక స్థానం దక్కింది. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు ఉండే దేశాల్లో ఒక్కటైనా ఇండోనేషియా  కరెన్సీపై వినాయకుడి బొమ్మను ముద్రిస్తోంది.

 ఇండోనేషియా సంస్కృతి, మన దేశ సంస్కృతి కాస్త దగ్గరిగానే ఉంటుంది. మన దేశంలో లాగే అక్కడ కూడా హిందూ దేవతల ఆరాధన ఉంటుంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నా... హిందూ మతం ప్రభావం మాత్రం స్పష్టంగా గోచరిస్తూనే ఉంటుంది. గణేశుడు బుద్ధికి సంకేతంగా అక్కడి వారు భావిస్తారు.

చాలా సంవత్సరాల క్రితం ఇండోనేషియాల ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. దీంతో అక్కడి ఆర్థిక వేత్తలు ఓ బృందంగా ఏర్పడి చర్చోప చర్చలు చేశారు. చివరికి... బుద్ధికి సంకేతం.. వినాయకుడి... అందుకే కరెన్సీపై వినాయకుడి బొమ్మను ముద్రిద్దామని ఆ బృందం డిసైడ్ అయినట్లు ఇండోనేషియా స్థానికులు పేర్కొంటున్నారు.

అయితే 1998 సంవత్సరంలో ఆ దేశంలో 20 వేల రూపాయల కొత్త నోట్లను ముద్రించడం ప్రారంభించారు. అప్పటి నుంచి గణేశుడి ఫొటోను తొలగించి.. కరెన్సీ నోటును ముద్రించడం ప్రారంభించారు.