పెళ్లి అనగానే పెళ్లి కూతురు పట్టుచీరలోనే ఊహించుకుంటారు ఎవరైనా. అదే దక్షిణాదిన అయితే.. లెహంగాలు వేసుకుంటారు. అయితే.. అలానే వేసుకోవాలని ఏదైనా రూల్ ఉందా.? నేను అందరిలా ఎందుకు వేసుకోవాలి..? భిన్నంగా  ఎందుకు వేసుకోకూడదు అని ఆలోచించింది ఓ వధువు.  అంతే.. విభిన్నంగా ఫ్యాంట్ సూట్ వేసుకుంది. అందుకే.. ఇప్పుడు ఆ వధువు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వధువు పేరు సంజన రిషి. కాగా.. ఆమె తన పెళ్లి డ్రెస్ గురించి ఏం చెబుతుందో చూడండి.

‘పెళ్లి కుమార్తె అనగానే సంప్రదాయంగా .. బొమ్మలా ఉండాలని ఎవరు చెప్పారు. ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వారు ఉంటారు.. అదే కరెక్ట్ గా సూట్ అవుతుంది కూడా. అందుకే నేేను అందరిలా దుస్తులు ధరించాలని అనుకోలేదు. నా స్టైల్‌కి నప్పే దుస్తులను ఎన్నుకోవాలనుకున్నాను. చేతి వృత్తుల వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో.. వారితోనే డ్రెస్ డిజైన్ చేయించుకున్నాను.  ఈ పాత చేవి రింగులను సలోని కొత్వాల్‌ నుంచి తీసుకున్నాను. నా అద్భుతమైన నూతన ఆభరణాలను అనుమెర్టాన్‌ దగ్గర నుంచి తీసుకున్నాను.

స్థానికల కళాకారులు నాలుగు రోజులు కష్టపడి వీటిని డిజైన్‌ చేశారు. ఇక నేను ధరించిన బస్టడ్‌ నా స్నేహితురాలి తల్లి దగ్గర నుంచి తీసుకున్నాను. కాఫీ​ పౌడర్‌తో డై వేసుకున్నాను. ఇక ఈ మొత్తం తంతులో నా సొంతమైనది ఏదైనా ఉందా అంటే నేను ధరించిన పౌడర్‌ బ్లూ ప్యాంట్‌ సూట్‌ మాత్రమే. నాకు నచ్చినట్లు నా బ్రైడల్‌ లుక్‌ని డిజైన్‌ చేసుకున్నాను. ఇందుకు గాను నేను లక్షలకు లక్షలు డబ్బు ఖర్చు చేయలేదు. సమయం కూడా వృథా చేయలేదు. అన్నింటికి మించి ఎంతో సంతృప్తికరంగా ఉన్నాను’ అంటూ సంజన రిషి షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. నెటిజనులు ఆమె ఐడియాకి ఫిదా అయ్యారు. మీరు, మీ ఐడియా రెండూ సూపర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.