Asianet News TeluguAsianet News Telugu

Viral News: నెంబర్ ప్లేట్ తెచ్చిన తిప్పలు.. కనీసం స్కూటీ ఎక్కలేకపోతున్న మహిళ..!

 అయితే తనకు స్కూటీ కావాలని ఆమె తన తల్లిదండ్రులను కోరింది. చివరకు నవంబర్ 3న తన పుట్టినరోజు సందర్భంగా స్కూటీని బహుమతిగా అందుకుంది. స్కూటీ నెంబర్ ప్లేట్ పై  SEX అని ఉండటం ఇప్పుడు ఆ అమ్మాయికి లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టడం గమనార్హం.

Delhi Girl Unable to Ride Scooty with 'SEX' on Number Plate as Neighbours Bully Her
Author
Hyderabad, First Published Dec 3, 2021, 4:52 PM IST

ఆమె ఓ ఫ్యాషన్ డిజైనింగ్ చదివే విద్యార్థి. ప్రతిరోజూ కాలేజీకి మెట్రోలో వెళ్లి వచ్చేది. ఆ ప్రయాణం ఎక్కువ గంటలు పడుతుండటంతో.. ఆమె పడుతున్న బాధ చూసి తట్టుకోలేక పోయిన ఆ అమ్మాయికి.. తల్లిదండ్రులు ఓ స్కూటీ బహుమతిగా ఇచ్చారు. ఆనందంతో ఎగిరి గంతులేసిన ఆ అమ్మాయి.. ఆ స్కూటీ నెంబర్ ప్లేట్ చూసి కంగుతిన్నది. ఆ నెంబర్ ప్లేట్ కారణంగా.. ఆమె ఇప్పుడు తన స్కూటీ వేసుకొని బయటకు వెళ్లలేకపోతోంది. ఎందుకంటే.. ఆ స్కూటీ నెంబర్ ప్లేట్ పై 'sex' అనే పదం ఉండటమే కారణం కావడం గమనార్హం.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ప్రీతి జనక్‌పురి నుండి నోయిడా వరకు ఢిల్లీ మెట్రో ద్వారా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి ఆమెకు సమయం ఎక్కువ పడుతుంది. అయితే తనకు స్కూటీ కావాలని ఆమె తన తల్లిదండ్రులను కోరింది. చివరకు నవంబర్ 3న తన పుట్టినరోజు సందర్భంగా స్కూటీని బహుమతిగా అందుకుంది. స్కూటీ నెంబర్ ప్లేట్ పై  SEX అని ఉండటం ఇప్పుడు ఆ అమ్మాయికి లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టడం గమనార్హం.

సాధారణంగా బైక్‌ నెంబర్ ప్లేట్‌పై నెంబర్‌తో పాటు ఆ వాహనం ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి చెందినదో సూచిస్తూ ఆంగ్లంలో అక్షరాలు కూడా ఉంటాయి. ఆ యువతికి వచ్చిన నంబర్ ప్లేట్‌‌పై `DL3 SEX` అనే అక్షరాలు ఉన్నాయి. అవే ఆమెకు ఊహించని చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇక స్కూటీ మీద ఆ పదాలను చూసి మొదట్లో, స్నేహితులు దీనిని ఎగతాళి చేయడం ప్రారంభించారు.

 

తర్వాత ఆ పదాలను చూసి ఇరుగుపొరుగు వారు ఆ యువతిని ఏడిపించడం మొదలు పెట్టారు. కొందరు దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఇది వైరల్ గా మారింది. దీంతో ఆమెకు అవమానం ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆ దెబ్బకు ఆమె ఆ స్కూటీపైనే తిరగడం మానేసింది. ఇదే విషయమై ఆర్‌టీఓ కార్యాలయాన్ని ఆమె తండ్రి సందర్శించాడు. తమకు కేటాయించిన నంబర్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. నంబర్ ను మార్చండి అని అడిగాడు. అయితే ఇలా ఢిల్లీలో `SEX` సిరీస్‌ నుంచి మొత్తం పదివేల వాహనాలకు నంబర్‌ ప్లేట్‌ కేటాయించామని, అది పెద్ద విషయం కాదని.. మార్చడం మాత్రం కుదరదు అని తేల్చి చెప్పడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios