Asianet News TeluguAsianet News Telugu

పామును నమిలి తిన్న జింక..వీడియో వైరల్

ఓ జింక పామును తింటోంది. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇది నిజంగా జరిగింది. ఐఎఎస్ ఆఫీసర్ సుశాంత్ నందా దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. 

Deer that chewed snake and ate.. video went viral - bsb
Author
First Published Jun 13, 2023, 6:54 AM IST

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో తన ఫాలోవర్స్ ను అబ్బురపరుస్తారు. తాజాగా, జింక పామును తిన్న మరో మనోహరమైన వీడియోను పంచుకున్నాడు. జింకలను శాకాహారులుగా పరిగణిస్తారు. ఇవి ప్రధానంగా  ఆకులు, అలములు, గడ్డిలాంటివాటిని ఆహారంగా తీసుకుంటాయి. అయితే, జింక పామును తినే ఈ అరుదైన దృశ్యాన్ని కారులో వెళ్తున్న ఓ వ్యక్తి చూశాడు.

వీడియోలో, అటవీ ప్రాంతంలో ఒక జింక రోడ్డు పక్కన నిలబడి పామును నమలడం కనిపిస్తుంది. వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో "జింక పామును తింటుందా?" అనడం వినిపిస్తుంది.

నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, జింకలు ఫాస్ఫరస్, ఉప్పు, కాల్షియం వంటి ఖనిజాల కోసం.. ప్రత్యేకించి శీతాకాలంలో మొక్కల జీవం తక్కువగా ఉన్నప్పుడు జింకలు మాంసాన్ని తినవచ్చు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోతో పాటు, "కెమెరాలు ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతున్నాయి. . శాకాహార జంతువులు కొన్ని సమయాల్లో పాములను తింటాయి." అంటూ క్యాప్షన్ రాశారు. 

ఈ వీడియోను సైన్స్ గర్ల్ అనే పేజీ కూడా షేర్ చేసింది. దీనిమీద నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పోస్ట్ చేసినప్పటి నుండి, ఈ వీడియోకు ట్విట్టర్‌లో లక్ష కంటే ఎక్కువవ్యూస్ వచ్చాయి. అనేక కామెంట్లు కూడా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios