ఇంటర్న్ షిప్ కోసం.. జొమాటో బాస్ కు వాలంటైన్స్ ప్రపోజల్.. ఫిదా అయిన సీఈఓ.. !
సీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థ బాస్ కు వాలెంటైన్స్ డే ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్ చూసిన ఆ బాస్ ఫిదా అయిపోయాడు. వెంటనే ఆమెకు ఆఫర్ ఇచ్చేశాడు.. ఇంతకీ ఆమె చేసిన ప్రపోజల్ ఏంటంటే...
ఫిబ్రవరి 14న Valentine's Day సందర్భంగా ఓ యువతి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ Zomato సీఈవో దీపిందర్ గోయల్ కు ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్ కు దీపీందర్ ఫిదా అయ్యారు. నెటిజన్లు సైతం ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
జొమాటో.. నిన్నమొన్నటిదాకా అదొక జస్ట్ చిన్న కంపెనీ. మొబైల్ యాప్ తో లక్షలాది మంది ఆకలి తీరుస్తుంది. హోటళ్లకు, కస్టమర్లకు వారధిగా మారి వేడివేడి ఫుడ్ ను క్షణాల్లో కస్టమర్లకు అందిస్తుంది. కట్ చేస్తే స్టార్టప్ నుంచి అతి తక్కువ సమయంలో లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు అదే కంపెనీలో తమిళనాడు సత్యబామ యూనివర్సిటీ సీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని దీక్షితా బసు ఇంటర్న్షిప్ చేయాలనుకుంది.
వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా 14 పేజీల ఇంటర్న్షిప్ ప్రపోజల్ ను తయారుచేసిజొమాటో సీఈవో Deepinder goyal, జొమాటో డిజైన్ లీడ్ విజయ వర్మ, ఫుల్ డెలివరీ సీఈఓ రాహుల్ గంజూని ట్యాగ్ చేసింది. అంతే ఆమె ప్రపోజల్ కు జోమాటో యాజమాన్యం స్పందించింది. ఇంటర్న్షిప్ చేసేందుకు అంగీకరించింది. అయితే ఇంతకీ యువతి ఇంటర్న్షిప్ ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆమె ఏంచేసిందో తెలుసా? క్రియేటివిటీని జోడించింది. మూస ధోరణిలో కాకుండా కొత్తగా, కాస్త భిన్నంగా ఆలోచించింది.
జొమాటో ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేయాలని అనుకున్న దీక్షితా బసు జొమాటో.. కస్టమర్లకు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేలా కొన్ని సలహాలు, అదేవిధంగా యాప్ లో కొన్ని లోపాలను ఎత్తి చూపుతూ 14 పేజీల ఇంటర్న్ షిప్ ని తయారుచేసింది. ఆ డ్రాఫ్ట్ కు సృజనాత్మకతను జోడించి చిన్న కార్టూన్ బొమ్మతో కట్టిపడేసింది. ఆ స్లైడర్ కు వాలెంటైన్స్ డే ఇంటర్న్ షిప్ ప్రపోజల్ పేరుపెట్టి.. లింక్డిన్ లో పోస్ట్ చేసి జొమాటో బాస్ కు ట్యాగ్ చేసింది.
అంతేనా ‘జొమాటో జింగ్’ అనే కొత్త కాన్సెప్ట్ 15 సెకన్ల వీడియోలో zoomato లో ఆర్డర్ పెట్టే కస్టమర్లకు తాను తెచ్చిన కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుందో వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన వాలెంటైన్ ప్రపోజల్ జొమాటో యాజమాన్యాన్ని కట్టిపడేసింది. నెటిజన్లు సైతం ఆ క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఆ పోస్టుకు 16వేలకు పైగా లైకులు, 800 కామెంట్ల వర్షం కురిపించారు.
దీక్షిత బస్సు ఇన్నోవేటివ్ థాట్ కు జొమాటో సీఈఓ గంజూ స్పందించారు. దీక్షితా బసు ప్రయత్నాన్ని అభినందిస్తున్నామని వ్యాఖ్యానించారు త్వరలోనే జొమాటో యాజమాన్యం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఈ పోస్ట్ పై విజయవర్మ కూడా ‘గ్రేట్ వర్క్’ అంటూ స్పందించారు.