స్పీడ్ బైక్‌పై జంట రొమాన్స్ వైరల్.. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారంటే...
యువతీయువకులు నడుస్తున్న బైక్ పై కౌగిలించుకుని వెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిమీద ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.
ఢిల్లీ : ఢిల్లీ మెట్రోనే కాదు.. ఫ్లై ఓవర్లు కూడా ప్రేమికుల పిచ్చి చేష్టలకు అడ్డాగా మారుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు మీదబైక్ పై వెడుతున్న ఓ యువతీయువకులు కౌగిలింతల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేస్తూ, వేగంగా బైక్‌లపై పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్ (పిడిఎ) కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి.
అలాంటి ఘటనే ఇది. జూలై 16న ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగిందని వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ఈ వీడియోలో ఫ్యూయల్ ట్యాంక్‌పై కూర్చున్న మహిళ, తన బాయ్ ఫ్రెండ్ ని ముందునుంచి కౌగిలించుకోవడం కనిపిస్తుంది. రైడ్ సమయంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్లు ఈ వీడియో చూపిస్తుంది.
లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు రెండు రోజుల మధ్యంతర బెయిల్..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, చాలా మంది దీనిమీద మండిపడుతున్నారు. బాధ్యతారాహిత్యమైన, అశ్లీల ప్రవర్తనకు విమర్శిస్తున్నారు. ఈ వీడియోపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.
''ధన్యవాదాలు, అటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ సెంటినల్ యాప్‌లో కంప్లైంట్ చేయమని అభ్యర్థిస్తున్నాం'' అన్నారు. మరికొందరు నెటిజన్లు.. మహిళ హెల్మెట్ ధరించలేదని, కాబట్టి వారిని అరెస్టు చేయాలని కోరారు.
మరొక యూజర్ స్పందిస్తూ.. ''సార్, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవాలి. ఇలాంటి చర్యలను ఖండించాలి. మరోసారి జరగకుండా చూసుకోవాలి. ఈ చర్య వాతావరణాన్ని చాలా పాడు చేసింది’’ అని మండిపడ్డారు.
గత నెలలో కూడా ఇదే విధమైన వీడియో వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతానికి సమీపంలో ఎన్ హెచ్9పై కదులుతున్న బైక్‌పై వెళుతున్నప్పుడు ఒక జంట ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది. వారిద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోలేదు.