పిల్లి అని పెంచుకుంటే.. అది పులి అని తెలిసి..
సీన్ రివర్స్ అయ్యింది. ఎందుకంటే అది పిల్లి కాదు.. పులి. తాను తెచ్చి పెంచుకున్న చాలా రోజుల తర్వాత అది పిల్లి కాదు.. పులి అని తెలియడంతో దాని యజమాని షాకయ్యాడు
కుక్కలు, పిల్లులు చూడటానికి చాలా ముద్దుగా ఉంటాయి. అందుకే ఎవరైనా వాటిని పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓ వ్యక్తి కూడా పిల్లి మీద ప్రేమతో తెచ్చి పెంచుకున్నాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఎందుకంటే అది పిల్లి కాదు.. పులి. తాను తెచ్చి పెంచుకున్న చాలా రోజుల తర్వాత అది పిల్లి కాదు.. పులి అని తెలియడంతో దాని యజమాని షాకయ్యాడు. వెంటనే భయంతో వణికిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నార్మండీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నార్మండీకి చెందిన లా, హవ్రే దంపతులు 2ఏళ్ల క్రితం సవానా జాతికి చెందిన పిల్లిని ఆన్‌లైన్ ప్రకటన చూశారు. వెంటనే వారిని సంప్రధించి రూ. 6 లక్షలు ( 6000 యూరోల)కు కొనుక్కున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో అపురూపంగా చూసుకున్నారు. ఇలా వారం గడిచిన తర్వాత అసలు విషయం బయటపడింది.
తాము తెచ్చుకున్నది. మూడు నెలల పులి పిల్ల అని తెలుసుకొని భయపడిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. మొదట లా, హవ్రేలపైనే పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే రెండేళ్ల సుధీర్ఘ విచారణ తర్వాత తొమ్మిది మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. లా, హవ్రేలను నిర్ధోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తరువాత ఆ పులిని ఓ జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు.