యూనిఫాంలో యూపీ పోలీసుల నాగిని డ్యాన్స్.. ఇంటర్నెట్ లో వైరల్..

ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరు పోలీసులు నాగిన్ డ్యాన్స్ చేస్తుంటే.. మిగతా పోలీసులు ఉత్సాహపరచడం దీంట్లో కనిపిస్తుంది. 

Cops Perform Naagin Dance in UttarPradesh

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ "నాగిన్" డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున యూపీలోని కొత్వాలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ట్విటర్‌లో అప్‌లోడ్ చేశారు. దీంట్లో పోలీసు అధికారులు బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ ట్రంపెట్‌ను నాదస్వరంలా వాయిస్తుంటూ.. కానిస్టేబుల్ "నాగిన్" నృత్యం చేశాడు. వీడియో చూస్తుంటే వెనక స్వాతంత్ర్య దినోత్సవ అలంకరణ కనిపిస్తుంది.

వీరిద్దరినీ చుట్టూ ఉన్న మిగతా పోలీసులు చప్పట్లతో హుషారెక్కిస్తున్నారు. ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే దీనికి 74,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇలాంటి వాటివల్ల పోలీసులు ఒత్తిడి నుంచి బాగా రిలీఫ్ పొందుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది వారిని ఉత్సాహంగా ఉంచడమే కాకుండా.. వారిమధ్య అనుబంధాన్ని పెంచుతుందని మరొకరు అంటున్నారు. 

Ajit Doval security lapse: ధోవల్ ఇంటి వద్ద భద్రతా లోపం.. ముగ్గురు కమాండోల తొలగింపు

మరొక నెటిజన్ కూడా నృత్య ప్రదర్శనను మెచ్చుకుంటూ.. ఇది మనస్సును రిఫ్రెష్ చేయడంలో సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. నిజానికి,  నాగిన్ డ్యాన్స్ వేయకుండా ఎవ్వరినీ ఆపలేం.. ఆ మ్యూజిక్ వచ్చిందంటే చాలు కాలు దానంతట అదే కదులుతుంది. అంటూ డ్యాన్స్ చేసిన పోలీసులను ట్విట్టర్ యూజర్ ఒకరు అభినందించారు. మరికొందరు ఈ పోలీసులను "మల్టీ టాలెంటెడ్" అని కొనియాడారు.

నిరుడు, అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే ముంబై పోలీసు డ్యాన్స్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నైగావ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న 38 ఏళ్ల పోలీస్‌కి డ్యూటీ అయిపోయాక, సెలవు రోజుల్లో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. ఆయన అలాంటి ఓ వీడియోను  ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడంతో అతని ప్రతిభ వెలుగులోకి వచ్చింది, అది వెంటనే ఇంటర్నెట్‌లో లైక్‌లు, ప్రశంసలతో హోరెత్తింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios