Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చిన్నారి మ్యాజిక్ ట్రిక్.. వీడియో వైరల్.. ఇంతకీ అందులో ఏముందంటే..

ఓ చిన్నారి మ్యాజిక్ ట్రిక్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. లైక్ లు, కామెంట్లతో దూసుకుపోతోంది. రైల్వే బ్యూరోక్రాట్ అనంత్ రూపనగుడి షేర్ చేసిన ఈ వీడియోలో ఏముందంటే.. 

childs magic trick that is shaking the internet, video goes viral - bsb
Author
First Published Feb 25, 2023, 11:51 AM IST

ఇంట్లో తొలి సంతానంగా.. పెద్దవారిగా పుట్టినవారికి.. చిన్నతనంనుంచే ఓ పెద్దరికం అలవడుతుంది. వారి తరువాత పుట్టేవారి పట్ల తల్లిదండ్రుల తరువాత అంత కేర్ చూపించడం..అటోమెటిక్ గా అలవడుతుంది. ఇక తమ చెల్లుళ్లు, తమ్ముళ్లను చూసుకోవడంలో.. వారిని ఆడించడంలో వీరు ముందుంటారు. అలాగే చేసిందో అక్క.. తమ్ముడితో కలిసి ఓ మ్యాజిక్ ట్రిక్ చేసింది. అయితే.. ఆ వీడియో చివర్లో ఆ అమ్మాయి చేసిన పని నెటిజన్లను బాగా నవ్విస్తోంది. 

ఈ వీడియోలో ఆ చిన్నారి తన తమ్ముడితో కలిసి టవల్ పట్టుకుని..ఓ మ్యాజిక్ ట్రిక్ చేసింది. టవల్ తో తమ్ముడిని మాయం చేయడమే ఆ ట్రిక్.. తమ్ముడి ముందు టవల్ పెట్టి ఊపుతూ.. కాసేపటికి తీసే సరికి ఆ అబ్బాయి మాయం అయ్యాడు. అయితే.. అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ట్రిక్ అయిపోగానే ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నట్టుగా చేయి ఊపుతూ, కిందికి చూసేసరికి తలుపు పక్కన తమ్ముడి కాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆ చిన్నారి తమ్ముడిని కాలితో లోపలికి జరుగు అన్నట్టుగా తన్నడం కనిపిస్తుంది. ఇదే నెటిజన్ల మెప్పు పొందుతోంది. 

కుటుంబంలో పెద్ద తోబుట్టువులుగా ఉన్న వారందరూ, హోదా యొక్క ప్రోత్సాహకాలు చాలా ఎక్కువ అని మేము చెప్పినప్పుడు వాస్తవాన్ని ధృవీకరించవచ్చు. పెద్ద తోబుట్టువులు ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రుల నుండి ఆశించే భారాన్ని మోస్తారని మాకు తెలుసు, కానీ వారు తమ చిన్న సోదరులు మరియు సోదరీమణులను కూడా ఆర్డర్ చేస్తారు. మరియు ముఖ్యంగా, వారి కొంటె లేదా ఫన్నీ సాహసాలలో వారిని సహాయకులుగా చేయండి.

అనంత్ రూపనగుడి అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. కామెంట్ల వరద గురించి చెప్పనక్కరలేదు. ఒక్కసారి చూసి వదిలేయడం లేదు.. ఆ వీడియోను మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా చూస్తూ నవ్వుల్లో మునిగిపోతున్నారు. అక్కాతమ్ముళ్ల మధ్య ఆ అనుబంధాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios