కరోనా వైరస్ నేపథ్యంలో అడుగు తీసి అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఎంత అత్యవసరమైన పనైనా ఇంటి నుంచే చక్కబెడుతున్నారు జనం. రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు సైతం ఇళ్లలోనే ఉండి ఛానెళ్ల చర్చల్లో పాల్గొని లైవ్‌లు ఇస్తున్నారు.

దీంతో వారి కుటుంబసభ్యులు సైతం లైవ్‌లో భాగమవుతున్నారు. దీని కారణంగా ఇంటర్వ్యూలు ఇచ్చే వారికి కాస్త ఇబ్బందిగా అనిపించినా.. వాటికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పనిచేసే డాక్టర్ క్లారే వెన్‌హామ్ ఇటీవల ఓ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇంట్లో నుంచే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓ అంశంపై ఆమె మాట్లాడుతుండగా.. క్లారే కుమార్తె స్కార్‌లెట్ తాను వేసిన యూనికార్న్ పెయింటింగ్‌తో రూమ్‌లోకి వచ్చేసింది. అక్కడితో ఆగకుండా దీనిని ఎక్కడ పెట్టాలంటూ తల్లిని అడగ్గా.. క్లారే ఓ సెల్ఫ్‌లో పెట్టమని చూపించింది.

ఈ సంఘటనతో ఇంటర్య్వూ చేస్తున్న ఫ్రేజర్ యూనికార్న్ చాలా బాగుందని, దానిని కింద షెల్ఫ్‌లో పెట్టాలని చూపించింది. అనంతరం తల్లి వద్దకు వచ్చిన స్కార్‌లెట్ అతడి పేరు ఏంటమ్మా అని ప్రశ్నించింది.

దీనికి క్లారే క్రిస్టియన్ ఫ్రేజర్ అని సమాధానం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారగా.. ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు ఈ తిప్పలు తప్పవంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.