రక్తాలు కారే వింత ఆచారం.. ముళ్ల కంపపై దొర్లుతూ దేవుడికి వేడుకోలు.. సోదరికి వీడ్కోలు...

 గ్రామానికి చెందిన కొంతమంది ముళ్ల కంపపై పడుకుని దొర్లుతున్నారు. ముళ్ల కంపా.. బాబోయ్.. అనుకుంటున్నారా? అది వారి ఆచారం. అది కూడా ఓ శుభకార్యంలో ఇలా చేస్తారట. మధ్యప్రదేశ్ లోని సెహరా గ్రామంలోని రజ్జడ్ తెగ ప్రజలు  తాము పాండవుల వారసులమని  చెబుతుంటారు.

Celebrations to God by tumbling on the thorny vibration and Farewell to sister in madhyapradesh

ఆచారాలు అనేక రకాలుంటాయి. అవి ప్రాంతాన్ని బట్టి.. అక్కడి మనుషుల జీవన పరిస్థితులను, స్థితిగతులను బట్టి మారుతుంటాయి. అయితే అవన్నీ తమను తాము కంట్రోల్ లో పెట్టుకోవడానికి, సమాజంలో ఓ కట్టుబాటు కోసం, నమ్మకం, విశ్వాసం... ఇలా అనేక రకాల కారణాల కోసం ఏర్పాటు చేసుకుంటారు. 

అయితే కొన్నిసార్లు.. కొన్ని ప్రాంతాల్లోని ఈ ఆచారాలు చాలా వింతంగా ఉంటాయి. భయంకరంగా కూడా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన పెద్దల శవాలను సంవత్సరానికి ఒకసారి ఇంటికి తీసుకువచ్చి అలంకరించి వారిని గౌరవిస్తుంటారు. ఇది వినడానికి వెన్నులో వణుకు పుట్టించినా.. అక్కడి వారికి అది తమ ప్రియాతి ప్రియమైన పెద్దలను, పూర్వీకులను గౌరవించే ఆచారం.

ఇలాంటివే ప్రపంచవ్యాప్తంగా బోల్డు ఆచారాలు. అలాగే మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ వింత ఆచారాలు ఉన్నాయి. అలాంటివి పాటించడం ఏ మాత్రం మంచిది కాదని తెలిసినా... వాటిని మానడానికి మాత్రం ప్రజలు అంగీకరించరు. ఇలాంటి మూఢ విశ్వాసాలకు మరో ఉదాహరణ మధ్యప్రదేశ్లోని బైతుల్ జిల్లాలో వెలుగుచూసింది.  

కర్నూల్ జిల్లాలో వింత ఆచారం: గాడిదలకు పెళ్లి, ఎందుకంటే?

ఇక్కడ ఓ గ్రామానికి చెందిన కొంతమంది ముళ్ల కంపపై పడుకుని దొర్లుతున్నారు. ముళ్ల కంపా.. బాబోయ్.. అనుకుంటున్నారా? అది వారి ఆచారం. అది కూడా ఓ శుభకార్యంలో ఇలా చేస్తారట. మధ్యప్రదేశ్ లోని సెహరా గ్రామంలోని రజ్జడ్ తెగ ప్రజలు  తాము పాండవుల వారసులమని  చెబుతుంటారు.

పురాణాల్లో పాండవులు తమ సత్యనిష్టను నిరూపించుకునేందుకు ముళ్ల కంపపై దొర్లారని.. అదే తరహాలో ఇప్పుడు తామూ ఆ ఆచారాన్ని పాటిస్తున్నామని అంటున్నారు. ఏటా అగ్ హన్ మాసంలో ముళ్ల కంప మీద రజ్జడ్ తెగ ప్రజలు దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దేవుడు సంతోషించి, తమ కోరికలు నెరవేరుస్తాడనేది వారి నమ్మకం. ముళ్ల మీద దొర్లిన అనంతరం తమ సోదరిని అత్తారింటికి సాగనంపుతూ వీడ్కోలు పలుకుతారు. 

ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలో ఇలాంటి ఓ వింత ఆచారమే గత సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చింది. Rain సమృద్దిగా కురవాలని  కోరుతూ గాడిదలకు ఘనం గా పెళ్లి చేశారు kurnool జిల్లా వాసులు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటారు. తరాలు మారినా కూడ ఈ ఆచారాలు, సంప్రదాయాలను ప్రజలు కొనసాగిస్తుంటారు. కర్నూల్ జిల్లాలో కూడ తమ పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాలను స్థానికులు కొనసాగిస్తున్నారు.

కర్నూల్ జిల్లాలో వింత ఆచారం: గాడిదలకు పెళ్లి, ఎందుకంటే?

వర్షాలు సమృద్దిగా కురవాలని కోరుతూ రెండు గాడిదలకు పెళ్లి చేశారు కర్నూల్ జిల్లావాసులు. జిల్లాలోని పత్తికొండ మండలం hosurలో ఈ ఘటన చోటు చేసుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ హోసూరు గ్రామ ప్రజలు వాసుదేవ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. 

ఇందులో బాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. అనంతరం  ఊరేగింపు నిర్వహించారు.  హోసూరు ప్రాంతంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. 

అచ్చం మనుషులకు ఎలాగైతే పెళ్లి తంతు నిర్వహిస్తారో గాడిదలకు కూడా అలాగే నిర్వహించారు. అయితే, గతంలో కూడా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు విస్తారంగా కురిశాయని అందుకే ఈ సంవత్సరం కూడా గాడిదలకు పెళ్లిళ్లు చేస్తున్నామని స్థానికులు చెప్పారు. ఈ గాడిదల పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios