Asianet News TeluguAsianet News Telugu

చనువు ఇచ్చింది కదా అని సింహంతో ఆటలాడితే...!

 జూని సందర్శించడానికి కొందరు అక్కడి జూకి వచ్చారు. ఎవరైనా క్రూర మృగాల జోలికి వెళితే.. వద్దు అని చెప్పాల్సిన జూ కీపర్ దానితో ఆటలాడాడు.
 

Caught On Camera: Zookeeper Has Finger Bitten Off By Lion After Teasing It Through Cage
Author
Hyderabad, First Published May 23, 2022, 3:33 PM IST

అడవికి సింహం రాజు. అలాంటి సింహాన్ని జూలో పెట్టి ఆడిస్తూ ఉంటారు.  జూలో సింహాన్ని చూడటానికి మనం వెళుతూ ఉంటాం. అయితే... సింహం జూలో ఉంది కదా... అది మనల్ని ఏం చేయగలదులే అని.. ధీమాగా దానితో పెట్టుకుంటే.. ఇదిగో ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి.... జూలో ఉంది కదా అని.. సింహాన్ని తెగ విసిగించేశాడు. దానిని ఆాట పట్టించాడు. ఆ టీజింగ్ తట్టుకోలేకపోయిన ఆ సింహం.. అతని వేలు కొరికేసింది. ఈ సంఘటన జమైకాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Caught On Camera: Zookeeper Has Finger Bitten Off By Lion After Teasing It Through Cage

జమైకాలోని జూలో పనిచేసే ఓ వ్యక్తి.... సింహంతో ఆటలాడి చేతి వేలు పొగొట్టుకున్నాడు. మ్యాటరేంటంటే... జూని సందర్శించడానికి కొందరు అక్కడి జూకి వచ్చారు. ఎవరైనా క్రూర మృగాల జోలికి వెళితే.. వద్దు అని చెప్పాల్సిన జూ కీపర్ దానితో ఆటలాడాడు.

 కేజులోకి చేతి వేళ్లు దూర్చి.. పిల్లితో ఆడుకుంటున్నట్టుగా.. సింహాన్ని టీజ్​ చేశాడు. ఆ సింహం కొంతసేపు ఏమీ చేయలేదు. వార్నింగ్​ ఇస్తూ.. అరచింది కూడా. కానీ అతను పట్టించుకోలేదు. వేళ్లతో సింహం ముఖాన్ని తాకడం మొదలుపెట్టాడు.

కొన్ని సెకన్లలో అంతా మారిపోయింది. సింహం ఆ వ్యక్తి వేళ్లను.. నోటితో కరిచేసింది. సింహం పట్టు నుంచి వేళ్లను బయటకు తీసేందుకు ఆ వ్యక్తి చాలా ప్రయత్నించాడు. కానీ ఫలితం దక్కలేదు. చాలా సేపటి తర్వాత.. సింహమే అతడిని వదిలేసింది. అప్పటికే.. ఆ వ్యక్తి కుడి చేతికి ఉండాల్సిన ఒక వేలు పోయింది!

 

సందర్శకుల కెమెరాలకు ఈ దృశ్యాలు చిక్కాయి. కాగా.. చుట్టుపక్కన అంత మంది ఉండగా.. ఒక్కరు కూడా అతడిని రక్షించేందుకు ప్రయత్నించలేదు. దీనిపై స్పందించిన ఓ సందర్శకురాలు.. 'జూకీపర్​ షో ఆఫ్​ చేశాడు. అదేదో జోక్​ జరుగుతోందేమే అని మేము అనుకున్నాము. పరిస్థితి తీవ్రత మాకు అర్థం కాలేదు. అతని రక్తాన్ని చూసిన తర్వాతే.. అది జోక్​ కాదని తెలిసింది. ఆ వేలికి ఉన్న చర్మం మొత్తం ఊడిపోయింది,' అని చెప్పింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios