వార్నీ.. ఈ కోతి చేసే పని చూస్తే.. మనుషుల ఉద్యోగాలకు చెక్ పెట్టేలా ఉంది.. వైరల్ వీడియో...

లంగూర్ కంప్యూటర్ ముందు కూర్చుని, కాగితాలను షఫుల్ చేస్తూ టైప్ చేస్తున్నట్లు నటిస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

Caught On Camera: Langur Using Computer At West Bengal Video Goes Viral - bsb

పశ్చిమ బెంగాల్ : మనిషి కోతినుంచే రూపాంతరం చెందాడని అంటారు. అందుకేనేమో మనిషికి కోతులకు అనేక సారూప్యతలు కనిపిస్తుంటాయి. అయితే, మన పూర్వీకుల జాతి అయిన కోతులు కూడా నేటి ట్రెండ్స్ ను ఫాలో అవ్వడమే ఇక్కడ కొసమెరుపు. ప్రస్తుతం ప్రపంచం అంతా  ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మారుతోంది. కంప్యూటర్లు, లాప్ టాప్ లు, టాబ్ లు.. రకరకాల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. 

మనుషులు వీటికి అలవాటు పడడం అవసరమో, ఆవశ్యకతో, తప్పనిసరో అయిపోయింది. కానీ  కోతుల వంటి ప్రైమేట్స్ కూడా ట్రెండ్‌ను అనుసరించడమే.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన విషయానికి వస్తే, ఒక లంగూర్ కంప్యూటర్‌ను వాడుతోంది. 

కంప్యూటర్ వాడడం కొమ్మనుంచి కొమ్మకు దూకినంత వీజీ అన్నట్టుగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడిన ఈ చిన్న వీడియోలో ఒక లంగూర్ కంప్యూటర్ ముందు కూర్చుని, కాగితాలను షఫుల్ చేస్తూ టైప్ చేస్తున్నట్లు నటిస్తుంది. అక్కడే డెస్క్‌లో ఉన్న ఓ వ్యక్తి చేసే పనిని అనుకరించడం కనిపిస్తుంది. పేపర్లను సీరియస్ గా వెతుకుతూ.. కీ బోర్డ్ లో ఏదో టైప్ చేస్తూ.. పెద్ద పనిమంతురాలిగా కనిపిస్తుంది.

Hate speech: అత్యంత విద్వేషపూరిత ప్రసంగాల వెనుక బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు.. షాకింగ్ రిపోర్టు

పోస్ట్ లో చెప్పిన దాని ప్రకారం ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్ ఎంక్వైరీ ఆఫీసులో వెలుగు చూసింది. ఈ క్లిప్‌లో, కోతి చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయిన జనాలు దాని చుట్టూ గుమిగూడి, అది చేస్తున్న పనిని గమనిస్తున్నారు. ఆ కోటి చేసే సీరియస్ పని చూసి వారు నవ్వుకోవడం, కోతి చేష్టలను స్వాగతించడం వినబడుతుంది.

షేర్ చేసినప్పటినుంచి ఈ వీడియో 3,000 కంటే ఎక్కువ వ్యూస్, అనేక లైక్‌లను పొందింది. వినియోగదారులు నవ్వుతున్న ఎమోజీలు, సరదా కామెంట్స్ తో వెల్లువెత్తిస్తున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. "సమర్థవంతమైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన లంగూర్" అంటే.. "కొత్త రిక్విప్‌మెంట్ స్టేషన్ మాస్టర్" అని మరొకరు సరదా పడ్డారు. "మన పూర్వీకులే అనేది మరోసారి నిరూపించబడింది" అని మరొకరు చమత్కరించారు.

అయితే, కోతులు 'డిజిటల్ అక్షరాస్యత'ని ప్రదర్శిస్తూ, మానవ నిర్మిత పరికరాలు, ఉత్పత్తులకు అనుగుణంగా పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. మరొకటి, స్మార్ట్‌ఫోన్‌పై కోతుల మొహాన్ని చూపించే ఉల్లాసకరమైన వీడియో ఇంటర్నెట్‌ను విడిపోయింది.

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఈ వీడియోను షేర్ చేస్తూ, ''డిజిటల్ అక్షరాస్యత అవగాహన నమ్మశక్యం కాని స్థాయికి చేరుకోవడంలో విజయం సాధించడాన్ని చూడండి!'' అన్నారు. వీడియోలో మూడు కోతులు ఆసక్తిగా స్క్రోల్ చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఒక వ్యక్తి పట్టుకున్నట్లు కనిపించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios