పదవీ విరమణ రోజున స్టీరింగ్‌ను ముద్దాడి, బస్సును కౌగిలించుకుని ఓ డ్రైవర్ భావోద్వేగం.. వీడియో వైరల్...
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో తమిళనాడు బస్సు డ్రైవర్ తన పదవీ విరమణ రోజున భావోద్వేగానికి లోనవ్వడం కనిపిస్తుంది.
తమిళనాడు : ఉద్యోగులకు పదవీ విరమణ చేసే రోజు నిజంగా ప్రత్యేకమైనది. ఉద్వేగభరితమైనది. ఎందుకంటే వారు చాలా యేళ్లుగా ఆ ఉద్యోగంలో.. పదవిలో ఉండి.. ఆ సంస్థతోనో, ఆఫీసుతోనో.. అక్కడి సహచరులతో అనుబంధాన్ని పెనవేసుకుని ఉంటారు. అది తమ జీవితాల్లో ఒక భాగంగా మారిపోయి ఉంటుంది. ఎన్నో జ్ఞాపకాలు పోగై ఉంటాయి. అందుకే పదవీ విరమణ రోజు భావోద్వేగానికి గురవుతుంటారు.
అలాంటి ఓ క్యూట్ వీడియోనే ఇది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ కు చెందిన ఈ వీడియో కూడా దీనికి భిన్నమైనది కాదు. పదవీ విరమణ రోజున, తన సహోద్యోగులకే కాకుండా 30 ఏళ్లుగా తాను నడిపిన బస్సుకు కూడా వీడ్కోలు పలుకాడు ఆ డ్రైవర్. ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు.
తమిళనాడులో రైలు కోచ్ చక్రంలో పగుళ్లు, తప్పిన పెను ప్రమాదం..
వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఆ డ్రైవర్ తన చివరి రోజున బస్సు స్టీరింగ్ వీల్‌ను ముద్దాడడడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తరువాత బస్సు దిగి బస్సు ఫుట్ బోర్డును తాకి నమస్కరించాడు. బస్సును తన చేతులతో చుట్టి.. కౌగిలించుకుని తనకు ఇన్ని రోజులు ఫుడ్ పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. బహుశా ఇదే తమ చివరిసారిగా కలుస్తామన్న భావనతో అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు.
దశాబ్దాలుగా బస్సు అతని కంపెనీగా ఉంది. వారు కలిసి అనేక ప్రయాణాలు చేశారు. ఈ పదవీ విరమణతో ఆ ప్రయాణాలన్నింటికీ ముగింపు పలికినట్టే...ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ ఎస్కే రోహిల్లా షేర్ చేశారు. “పదవీ విరమణపై భావోద్వేగ వీడ్కోలు. ఈ తమిళనాడు బస్ డ్రైవర్‌కి సెల్యూట్" అని వీడియో క్యాప్షన్ పెట్టారాయన.