పెళ్లిలోనే వధువు చెంప చెళ్లుమనిపించిన వరుడు..వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే...

సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు, ఎందుకు, ఎలా వైరల్ అవుతుందో తెలియదు. అలా.. ఓ చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఓ వరుడు, పెళ్లిలోనే వధువును ఈడ్చి ఒక్కటిచ్చాడు.. ఎందుకంటే....

bridegroom angrily slaps bride during marriage video goes viral

ఇటీవల social mediaలో వైరల్ అవుతున్న వీడియోల్లో marriageకి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి.  అయితే వీటిలో కొన్ని dance, ఎంజాయ్ మెంట్ తో సరదాగా ఉంటే మరికొన్ని పెళ్లిని పెటాకులు చేసే సీరియస్ వీడియోలు ఉన్నాయి. తాజాగా పెళ్లిలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ వీడియో  నెట్టింట్లో వైరల్ గా మారింది. కోపంతో ఊగిపోయిన bridegroom,   ఒక్కసారిగా వధువు చెంపపై లాగి ఒక్కటిచ్చాడు. వివరాల్లోకి వెళితే..

పెళ్లి తర్వాత దండలు మార్చుకునే సందర్భంలో వరుడు, వధువు ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు. ఇంతలో వధువుకి  వరుడు స్వీట్ తినిపిస్తుండగా ఆమె నిరాకరించింది. దీంతో అతను స్వీట్ ను కోపంతో పెళ్లికూతురు మొహంపై విసిరాడు. పెళ్లి కొడుకు చేసిన పనికి కోపం తెచ్చుకున్న వధువు కూడా స్వీట్స్ ను అతని ముఖంపై విసిరింది. ఇంకేముంది అప్పటికే కోపంతో రగిలి పోతున్న వరుడికి ఆవేశం మరింత ఎక్కువైంది. అంతే పెళ్లికి వచ్చిన అతిథులందరి ముందే పెళ్లికూతురు చెంప చెల్లుమనిపించాడు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు కానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 23,000 లైకులు,  పదిహేను వందల కామెంట్లు వచ్చి చేరాయి. అయితే కొంతమంది వీడియోని చూసి నవ్వుకుంటుంటే, మరికొంతమంది వధువును కొట్టే అధికారం వరుడికి లేదంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన జనవరి 28న ఒకటి జరిగింది. పెళ్లిలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు వివాహాలే రద్దయ్యేలా చేస్తాయి. ఇదివరకటి కాలంలో ఇలాంటి ఘటనలు జరిగితే పెద్దలు సర్దిచెబితే గొడవ సద్దు మణిగేది. కానీ నేటి కాలంలో వధువు కానీ, వరుడు కానీ అస్సలు అలా ఒప్పుకోవడం లేదు. వందశాతం తాము అనుకున్నట్టే ఉండాలి. ఏ కాస్త తేడా వచ్చినా పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది. 

వివాహ వేడుకలో groom చేసిన చిన్న పొరపాటు వల్ల తాను అతన్ని పెళ్లి చేసుకోనని bride తెగేసి చెప్పిన ఘటన UttarPradesh రాష్ట్రంలో సంచలనం రేపింది. వరమాల వేడుకలో వరుడు garland విసిరేయడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలోని ఔరయ్యా జిల్లాలోని బిదునా కొత్వాలి పట్టణం నవీన్ బస్తీలో వెలుగుచూసింది.

ఔరయ్యా జిల్లాకు చెందిన వధూవరులు పెళ్లి చేసుకునేందుకు పెళ్లిపందిరి వద్దకు వచ్చారు. సంప్రదాయబద్దంగా జరగాల్సిన వరమాల వేడుకలో వరుడు పూలదండను విసిరి వేసాడు. అంతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు వరుడుని పెళ్లాడేందుకు నిరాకరించింది. పెళ్లికూతురు నిర్ణయంతో వచ్చిన అతిథులు షాక్ కు గురయ్యారు.

ఈ ఘటనతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  పెళ్ళికి వధువును ఒప్పించేందుకు పెళ్లి పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటన జరిగినప్పుడు వరుడి కుటుంబీకులు భోజనం చేసేందుకు పెళ్లి పందిరి వద్ద నుంచి బయటకు వెళ్లారు. కాగా తాను పూలదండను విసిరి కొట్టలేదని వరుడు ఆకాష్ వివరణ ఇచ్చినా, పెళ్లి చేసుకునేందుకు మాత్రం వధువు ససేమిరా అని చెప్పేసింది. దీంతో పెళ్లి వేడుక కాస్తా ఆగిపోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios