Asianet News TeluguAsianet News Telugu

వైరల్ : తట్టుసంచులతో న్యూ వెరైటీ పలాజో.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

తృణధాన్యాలు, బియ్యం లాంటి వాటిని నిల్వ చేయడానికి తరచుగా ఉపయోగించే గన్నీ బ్యాగ్‌లను ఉపయోగించి చేసిన ఓ పలాజో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

Bori Wala Palazzo goes viral in internet - bsb
Author
First Published Feb 18, 2023, 12:20 PM IST

బస్త సంచులు గుర్తున్నాయా? ఒకప్పుడు బియ్యం, పప్పులు, మిరపకాయలు లాంటి వస్తువులు ఈ బస్తాల్లోనే నిల్వ చేసేవారు. గన్నీ బ్యాగ్ లు అంటారు. ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అవ్వడంతో ఈ సంచులు కనుమరుగవుతున్నాయి. అక్కడక్కడా ఇవి వాడుతున్నప్పటికీ సగానికిపైగా తగ్గిందనే చెప్పాలి. వీటి గురించి నేటి తరానికి పెద్దగా తెలియదని కూడా చెప్పాలి.. వీటినే కొన్ని ప్రాంతాల్లో తట్టు సంచులు అని కూడా అంటారు. ఇదంతా ఎందుకంటే ఇప్పుడీ గన్నీ బ్యాగులతో బట్టలు కుడుతున్నారు.

హతవిథీ అనుకుంటున్నారా? అప్పుడే తొందరేముంది.. దీని ధర తెలుసుకున్నాక ఏకంగా.. షాక్ లోకి వెడుదురు.. కాసేపు ఆగండి.. గన్నీ బ్యాగ్ తో చేసిన ఓ ప్లాజో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీని ధర కేవలం రూ. 60వేల రూపాయలు మాత్రమే. ఇప్పుడు అవాక్కవ్వండి..

ఒకప్పుడు రోడ్ల మీద ఉండే పేదజనం బట్టలు కూడా లేని సమయంలో వీటిని బట్టలుగా ఉపయోగించిన ఉదంతాలు... మన అమ్మల కాలంలో చూసి ఉంటారు. ఇప్పుడు డబ్బులెక్కువై.. వాటితో ఫ్యాషన్ లకు దారి తీస్తున్నారు. అదీ సంగతి.. 

సోషల్ మీడియాలో "సచ్కద్వాహై" అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షోరూమ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. బస్తాల తయారీకి ఉపయోగించే జూట్ ఫాబ్రిక్‌తో చేసిన పలాజోను ప్రదర్శించారు. దీని గరిష్ట రిటైల్ ధర రూ. 60,000. ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను హిందీలో క్యాప్షన్‌తో షేర్ చేసింది.."క్యా ఆప్ ఈజ్ బోరి కే పలాజ్జో కే లియే 60,000 రూపాయల దేంగే?".. అని ఇచ్చింది. అంటే ఈ తట్టుసంచితో కుట్టిన పలాజో కోసం మీరు రూ.60వేలు పెడతారా? అని అర్థం. 

దీంతో ఈ పోస్ట్ చాలా వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో దీన్ని 5,00,000 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. నవ్వుతూ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒకరు "ఈ ప్యాంటు ప్రమాదవశాత్తు నేలపై పడితే, తెలీక కాళ్లు తుడుచుకునే ప్రమాదం ఉంది’ అని ఒకరు రాసుకొచ్చారు. "ఇది నిజమైన రీసైక్లింగ్," అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

"ఈ దుకాణాన్ని తెరవడానికి ముందు తను జీవితకాలంలో ఉపయోగించి ఏకైక బియ్యం బ్యాగ్ అని దీని యజమాని భావోద్వేగంతో విక్రయిస్తే తప్ప, అది అమ్ముడవుతుందని ఆశించలేరు" అని మూడో వ్యక్తి కామెంట్ చేశాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios