Asianet News TeluguAsianet News Telugu

ఓర్నీ.. భర్తకు బదులు మామను పెళ్లిచేసుకున్న మహిళ.. అసలేం జరిగిందంటే..

పెళ్లిలో జరిగిన చిన్న పొరపాటుతో ఓ మహిళ భర్తకు బదులు మామను పెళ్లాడింది. మ్యారేజ్ సర్టిఫికెట్ లో భర్త స్థానంలో... భర్త. మామ ఇద్దరూ భర్తలుగా నమోదయ్యింది. 

Bizarre Wedding Blunder : Woman Marries Her Father-In-Law In Australia - bsb
Author
First Published Jul 21, 2023, 10:47 AM IST

ఆస్ట్రేలియా : ఆత్రం పెళ్ళికొడుకు అత్త మెడలో తాళి కట్టాడని.. మన దగ్గర ఓ సామెత ఉంది.. అలాంటి ఘటన ఆస్ట్రేలియాలో ఒకటి వెలుగు చూసి ఇప్పుడు వైరల్ గా మారింది.  ఓ మహిళ భర్తకు బదులు మామను పెళ్లాడింది. అయితే ఆ విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత రేడియో షోలో చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ రేడియో షో ఫిడ్జి అండ్ విప్పా విత్ కేట్ రిచీలో ఒక మహిళ తన జీవితంలో జరిగిన ఓ పొరపాటున గురించి ఇలా చెప్పింది.

రిజిస్టర్ మ్యారేజ్ సందర్భంలో తన భర్త సంతకం చేయాల్సిన చోట మామగారు సంతకం పెట్టాడని తెలిపింది. దీంతో తనకు మామగారితోనూ, తన భర్తతోనూ పెళ్లయినట్లుగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వారు సర్టిఫికెట్ ఇచ్చారట. ఇప్పుడు.. తనకి ఇద్దరు భర్తలు అంటూ చెప్పుకొచ్చింది. 

అరిచినందుకు అమెరికన్ మహిళ అరెస్ట్.. దుబాయ్ లో వింత ఘటన..

అయితే,  అది చిన్న పొరపాటు మాత్రమేనని తను కాపురం మాత్రం తన భర్తతోనే చేస్తున్నానంటూ తెలిపింది. ఈ విషయం తన కుటుంబంలో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఇది ఎలా వెలుగులోకి వచ్చిందంటే... ఆస్ట్రేలియాలో ప్రసిద్ధి చెందిన బ్రేక్ ఫాస్ట్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ.. రోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని శ్రోతలను దానిమీద మాట్లాడిస్తుంది. 

అలా ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ వారి జీవితాల్లో జరిగిన పెద్ద పొరపాట్ల గురించి చెప్పమని అడిగారు వ్యాఖ్యాత. ఈ క్రమంలోనే కిమ్  అనే ఓ మహిళ.. తన పెళ్లిలో జరిగిన ఓ విచిత్రమైన పొరపాటు గురించి తెలిపింది. తమ పెళ్లికి సాక్షులుగా సంతకం చేయడానికి కాబోయే అత్తమామలు వచ్చారట.  

వారు తప్ప వారిద్దరి తరపున సాక్షి సంతకం చేయడానికి ఎవరూ లేకపోవడంతో…వారితోనే సంతకాలు పెట్టించారు. ‘సంతకం చేస్తున్న సమయంలో నా భర్త, ఆయన తండ్రి.. ఒకే లైన్లో సంతకం చేశారు. ఆ తర్వాత సర్టిఫికెట్ లో చూసేసరికి వధువు సంతకం ఉండే చోట నా సంతకం ఉంది. వరుడు అని ఉండాల్సిన చోట నా భర్తతో పాటు మామ గారి సంతకం కూడా ఉంది. 

దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాం. కానీ జరిగిన పొరపాటు అర్థం చేసుకున్న తర్వాత సరి పెట్టుకున్నాం. ఆ సర్టిఫికెట్ ను ఇప్పటివరకు మేము మార్చలేదు.  అలాగే భద్రంగా దాచుకున్నాం. అలాచూస్తే.. ఆ పొరపాటు వల్ల నాకు ఇద్దరు భర్తలు అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.  దీనిమీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రొలింగ్ నడుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios