Asianet News TeluguAsianet News Telugu

చిలిపి పక్షి.. మహిళ చెవిలోని ఎయిర్ పాడ్ దొంగిలించి.. పారిపోయి.. వీడియో వైరల్...

ఓ చిలిపి పక్షి వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఆ పక్షి ఒక మహిళ సంగీతం వింటున్నప్పుడు ఆమె ఎయిర్‌పాడ్‌ను ఎత్తుకుని, పారిపోయింది. ఈ క్లిప్ ను రెడ్డిట్‌లోని ఒక పేజీలో షేర్ చేశారు.

Bird steals, flies away with woman's AirPod in viral video. Internet reacts
Author
First Published Nov 2, 2022, 12:19 PM IST

ఇంటర్నెట్ లో ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన వారందరి మొహంలోనూ నవ్వులు పూయిస్తోంది. ఆ పక్షి చేసిన చిలిపి పనికి అందరూ ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మామూలుగా పక్షులు తినుబండారాలో, కర్రపుల్లలో ఎత్తుకుపోతుంటాయి. కానీ ఈ పక్షి ఎత్తుకుపోయిన వస్తువు చూసి నెటిజన్లు.. వారెవ్వా.. ఇది అల్ట్రా మాడ్రన్.. 5జీ పక్షిలా ఉందని అనుకుంటున్నారు. అంతేనా...ఎంచక్కా దొంగతనం చేయడమే కాదు.. చేసిన వస్తువుతో ఎగిరిపోయింది. 

దీనికి ఇవ్వడానికి నిరాకరిస్తూ ముప్పుతిప్పలు పెట్టింది. ఇంతకీ ఆ పక్షి ఎత్తుకెళ్లింది ఏంటో తెలుసా.. ఇయర్ పాడ్.. అదేం చేసుకుంటుంది.. అనే కదా మీ డౌట్.. దీనికి ఆ పక్షి మాత్రమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో రెడ్‌డిట్‌లో యానిమల్ బీయింగ్ జెర్క్స్ అనే పేజీ లో షేర్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక మహిళ పడుకుని.. తన ఎయిర్‌పాడ్‌లలో సంగీతాన్ని వింటుంది. 

షాపింగ్‌ మాల్‌లో చాక్లెట్‌ చోరీ చేసిన విద్యార్థిని.. వీడియో వైరల్ కావడంతో ఆత్మహత్య..

ఆమె పెంపుడు పక్షి అది గమనించింది. కాసేపటి తరువాత.. ఆమె పెంపుడు పక్షి ఎగిరి ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె ఎయిర్‌పాడ్‌లలో ఒకదాన్ని దొంగిలించింది. అది ఎగిరిపోయి, వైర్‌పైన, ఆపై ఒక కొమ్మపైన, ఎయిర్‌పాడ్‌తో సహా కూర్చుంది. ఆ తరువాత పక్షి ఎగిరి దాని బోను పైన కూర్చుంది. అప్పుడు ఆమె పక్షి దగ్గరినుంచి ఇయర్ పాడ్ తీసుకోవడానికి ట్రై చేస్తే.. అది వదలలేదు. 

ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే నెటిజస్ల నుంచి కామెంట్స్, లైక్స్.. వ్యూస్ తో దూసుకుపోతోంది. ‘ఆమె వింటున్న పాట దానికి నచ్చలేదేమో..’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు అరటిపండు ఇస్తే ఇయర్ పాడ్ ఇస్తుందా? అసలు పక్షులు అరటిపండు తింటాయా?? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios