రోజూ వంట చేయడం ఇబ్బందిగా ఉందని.. 8నెలలకు సరిపడా వండేసి..!
అలా అని ప్రతిరోజూ బయట ఆహారం తినడం కూడా చాలా మందికి నచ్చదు. ఇదే పరిస్థితి ఓ మహిళకు ఏర్పడింది. అందుకే ఆమె ప్రత్యామ్నాయం ఆలోచించింది. ఇప్పుడు అదే అందరినీ ఆకట్టుకుంటోంది.
మనం ఖాళీ గా ఉన్నా.. ఉద్యోగం చేస్తున్నా.. ఎక్కడకైనా వెళ్లినా... మనం ఏం చేసినా సరే... ఉదయం లేవగానే కడుపులో గంట కొడుతుంది. మనం ఏం చేస్తున్నాం.. ఎలా ఉన్నాం అనే విషయంతో ఆకలికి పనిలేదు. సమయానికి కడుపులో ఆహారం పడాల్సిందే. అందుకే.. తప్పనిసరిగా.. ఉదయం, మధ్యాహ్నం, సాయత్రం ఇలా మూడు పూటలకు భోజనం సిద్ధం చేసుకోవాల్సిందే. అయితే.. రోజూ వంట చేసుకోవడం చాలా మందికి కుదరకపోవచ్చు. వారు చేస్తున్న ఉద్యోగాలు అందుకు కారణం కావచ్చు. అలా అని ప్రతిరోజూ బయట ఆహారం తినడం కూడా చాలా మందికి నచ్చదు. ఇదే పరిస్థితి ఓ మహిళకు ఏర్పడింది. అందుకే ఆమె ప్రత్యామ్నాయం ఆలోచించింది. ఇప్పుడు అదే అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రతిరోజూ వంట చేయడం కుదరడం లేదని.. ఏకంగా 8 నెలలకు సరిపడా ఆమె వంట ముందుగానే సిద్ధం చేసింది. అలా ఎలా.. నిన్న వండింది.. ఈరోజుకి పనికిరాదు కదా అనే సందేహం మీకు కలగవచ్చు. అయితే.. ఆహారం త్వరగా పాడవ్వకుండా ఎక్కువకాలం నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆమె ఈ ఆహారాన్ని తయారు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు...? ఆమె కథేంటో ఓసారి చూద్దాం..
ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీషా(30) అనే మహిళ.. తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడింది. ప్రతిరోజూ... తన కుటుంబసభ్యులకు వంట చేసి పెట్టడమే ఆమెకు పెద్ద పని అయ్యేది. రోజంతా అదే సరిపోయేది. వేరే పని చేయడానికి సమయమే లేదు అన్నట్లుగా ఆమె పరిస్థితి ఉండేది. దీంతో.. ఆమె ఆహారం నిల్వ చేసే పద్దతుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.
దీని కోసం ఆమె కాస్త ఎక్కువగానే కసరత్తులు చేశారు. ప్రతిరోజూ రెండుగంటల పాటు సమయం దానికి కేటాయించి.. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునారు. దాదాపు 3 నెలల పాటు శ్రమించి దాదాపు 426 మీల్స్ సిద్ధం చేశారు. దాదాపు 3 నెలల పాటు కష్టపడి ఆమె ఈ ఆహారాన్ని నిల్వ చేశారు. అయితే... ఈ ఆహారం వారికి 8 నెలల పాటు సరిపోయిందట. కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరు ఆ ఆహారాన్ని తీసుకున్నారట. డీ హైడ్రేషన్, వాటన్ క్యానింగ్ లాంటి వివిధ రకాల పద్దతుల్లో ఆమె ఈ ఆహారాన్ని నిల్వ చేసినట్లు చెప్పారు.