ఆటో అన్నా.. అన్నాదురైకి.. ఆనంద్ మహీంద్రా అభినందనలు.. ఆటోడ్రైవర్ కాదు, మేనేజ్మెంట్లో ప్రొఫెసర్ అంటూ కితాబు..

దినపత్రిక నుంచి ఐ-పాడ్ వరకు సకల వసతులు అన్నాదురై ఆటోలో ఉండడం గమనార్హం. ఇది సామాజిక మాధ్యమాలు నేడు ట్రెండ్ గా మారింది. ఆనంద మహీంద్రా ఆ ఆటోను చూసి ఆశ్చర్యపోయారు అంటే వసతులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తంజావూరు సమీపం పేరావూరనిలో పుట్టిన అన్నాదురై కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఆయన తండ్రి, సోదరుడు కూడా ఆటోడ్రైవర్లే. 

 


 

Anand Mahindra thinks this Chennai auto driver is a professor of management

సైదా పేట :  చెన్నై ఆటోడ్రైవర్ Annadurai గురించి ఆనంద్ మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ Social mediaల్లో ఇప్పుడు వైరల్ గా మారింది. చెన్నైలో పలువురికి ఆటో అన్నాగా పరిచయమైన అన్నాదురై గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆటోలో ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలే Anand Mahindra అభినందనకు కారణమయ్యాయి. 

దినపత్రిక నుంచి ఐ-పాడ్ వరకు సకల వసతులు అన్నాదురై ఆటోలో ఉండడం గమనార్హం. ఇది సామాజిక మాధ్యమాలు నేడు ట్రెండ్ గా మారింది. ఆనంద మహీంద్రా ఆ ఆటోను చూసి ఆశ్చర్యపోయారు అంటే వసతులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తంజావూరు సమీపం పేరావూరనిలో పుట్టిన అన్నాదురై కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఆయన తండ్రి, సోదరుడు కూడా ఆటోడ్రైవర్లే. 

అన్నాదురైకి చిన్నతనం నుంచి వ్యాపారం చేయాలని ఆశ. కుటుంబ పరిస్థితి కారణంగా Autodriver గా మారారు. ఇక్కడ తన ప్రత్యేకత చూపారు. ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే చెన్నై ఓఎమ్మార్ old mahabalipuram roadలో అన్నాదురై ఆటో నడుపుతున్నాడు. ఆటోలో వార, వార్తాపత్రికలు, బిజినెస్ మ్యాగజైన్లు, ఐప్యాడ్, చిన్న టీవీ, అమెజాన్ ఎకో, లాప్టాప్, శాంసంగ్ ట్యాబ్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఉచిత వైఫై వసతి కూడా ఉంది. ఓఎమ్మార్ లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉన్నందున వారి అవసరాల మేరకు వీటిని ఏర్పాటు చేశారు.

దీంతో ఎక్కువ మంది ఆయన ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ వ్యాపార నమూనా పలు సంస్థలను ఆకర్షించింది. వాటి ఆహ్వానం మేరకు అన్నాదురై వెళ్లి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ఇలా ఐఐటి, ఐఐఎంలలో కూడా ప్రసంగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అన్నాదురై గురించి ఓ ఛానల్ విడుదల చేసిన వీడియోలు  షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా అభినందించారు. 

అన్నాదురై నుంచి మనం నేర్చుకోవాలి అని, ఎంబీఏ విద్యార్థులు ఒక్కరోజు ఆయనతో గడిపితే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఆయన కేవలం ఆటోడ్రైవర్ కాదని, మేనేజ్మెంట్లో ప్రొఫెసర్ అని ట్వీట్ చేశారు. దీంతో మరో మరు అన్నాదురై పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోతోంది. 

ఇదిలా ఉండగా, జనవరి 4న ఓ Street Performer కు అతని దశ తిరిగే ఆఫర్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. హర్యానాకి చెందిన వరుణ్ అనే యువకుడు కన్నాట్ ప్లేస్ లో ఫుట్ పాత్ మీద తన కళను ప్రదర్శిస్తూ బతికేస్తున్నాడు. స్ట్రీట్ పెర్ఫార్మర్ గా వరుణ్ ప్రదర్శనలు ఇచ్చేవాడు. క్రమంగా ఆ స్ట్రీట్ పెర్ఫార్మర్ కి అభిమానులు పెరిగారు. ఓ జాతీయ మీడియా సైతం వరుణ్ మీద చిన్న కథనం ప్రసారం చేసింది. స్ట్రీట్ పెర్ఫార్మర్ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు ఆనంద్ మహీంద్రా. డ్యాన్స్ లో మనందరం భాగమే. డ్యాన్స్ ద్వారా నీ భావ వ్యక్తీకరణను ఇక మీద ఎవ్వరూ ఆపలేరు. అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. జాతీయ మీడియా ప్రసారం చేసిన వీడియోను ట్విట్టర్ షేర్ చేశారు. 

వరుణ్ డ్యాన్స్ కి పాటకి ముగ్ధుడై ప్రశంసలతోనే వదిలేయలేదు ఆనంద్ మహీంద్రా. వరుణ్ ప్రతిభకి సరైన వేదిక కల్పించే పనిలో పడ్డారు. మహీంద్రా గ్రూపు కల్చరల్ విభాగం హెడ్ జయ్ ఏ షాని లైన్ లో తీసుకున్నారు. ఢిల్లీలో మహీంద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్ ఈవెంట్స్ లో వరుణ్ ప్రోగ్రామ్ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios