రుతుపవనాలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. వీడియో చూస్తే అబ్బురపడాల్సిందే...
ముంబైని రుతుపవనాలు తాకాయి. ఈ సంతోషాన్ని ఓ చిన్న వీడియోతో పంచుకుంటూ ఆనంద మహీంద్ర ట్విట్టర్ ఓ షేర్ చేశారు.
మహారాష్ట్ర : దేశ వ్యాప్తంగా రుతుపవనాలు అందరికీ ఉపశమనం కలిగించిన విషయం తెలిసిందే. ఇక ముంబైలో కురుస్తున్న వర్షాలు అక్కడివారిని సంతోషంలో ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాన్ని ఇంట్లోనే ఉండి ఆస్వాదిస్తున్నారు. వీరిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. ఆయన రుతుపవనాల సంతోషాన్ని ఓ అందమైన వీడియోతో పంచుకున్నారు.
వర్షాన్ని ఆస్వాదిస్తున్న పసిబిడ్డను కలిగి ఉన్న ఒక అద్భుతమైన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ద్వారా ఆనంద్ మహీంద్రా వర్షాకాలంలో ముంబైలో తన ఇంట్లో ఉన్నప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉందో చెబుతోంది. "ఎట్టకేలకు రుతుపవనాలు వచ్చాయి. ఇది ప్రతీ భారతీయుడికి ఎంతో సంతోషకరంగా ఉందో ఈ చిన్నారి చర్య తెలుపుతోంది. మనలో ప్రతీ ఒక్కరిలో ఈ చిన్నారి లాంటి మనసే ఉంటుంది. చిరు జల్లులలో ఆనందాన్ని వెతుక్కోవవడానికి తపించి పోతాం" అని క్యాప్షన్ రాసుకొచ్చారు.
“ముంబయిలో వర్షాకాలం వర్షం గురించి మాత్రమే కాదు-సరదాగా, హాయిగా నవ్వుతూ ఉండే సమయం. మనలోని చిన్న పిల్లలను మరోసారి బైటికి తెచ్చే సమయం. మాన్‌సూన్ ఒలింపిక్స్ నుండి రైనీ రోలర్‌కోస్టర్ రైడ్‌ల వరకు, ముంబైవాసులు కురిసిన వర్షంలో ఆనందాన్ని పొందుతారు, నగరాన్ని విచిత్రమైన ఆట స్థలంగా మార్చారు”అని ఒక యూజర్ స్పందించారు.
"నేను నా బాల్యాన్ని మరచిపోలేను, నేను నా స్నేహితులతో కలిసి కాగితాలతో పడవలు తయారు చేసి, వాటిని భారీ వర్షాలలో పారుతున్న నీటిలో.. రోడ్లపై వేసి ఆడుకునేవాడిని.. ఆ రోజులు ఎంతో అద్భుత మైనవి" అని మరొక వినియోగదారు రాశారు. ఎట్టకేలకు ఆదివారం నగరంలో రుతుపవనాలు ప్రారంభమయ్యాయి.