ప్రేమగా పెంచుకున్న కొండచిలువే... ప్రాణం తీసింది..

ఆమె చనిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టులో ఆమె గొంతును బలంగా నులమడంతో చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు.

An Indiana woman died with a python around her neck. There were 140 snakes in the house.

ఆమెకు పాములంటే పంచ ప్రాణం. అందరూ కుక్కలు, పిల్లలు పెంచుకున్నట్లు ఆమె తన ఇంట్లో 140 పాములు పెంచింది. కానీ... ఆమెకు పాములమీద ఉన్న ప్రేమే ఆమె ప్రాణాలు తీసింది. ఆమె ఎంతో ఇష్టంగా ప్రాణంగా పెంచుకున్న కొండ చిలువ మెడకు చుట్టుకొని మహిళ మృతిచెందింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఇండియానాలోని ఆక్స్ ఫర్డ్ లో నివసించే లారా హార్ట్(36) అనే మహిళకు పాములంటే ప్రాణం. దాదాపు 140 పాములను ఆమె తన ఇంట్లో పెంచుకుంటోంది. వీటిలో ఎనిమిది అడుగుల కొండచిలువ కూడా ఉంది. ఆ కొండ చిలువ ఆమె మెడను గట్టిగా చుట్టేయడంతో ఊపిరాడక ఆమె మృతి చెందింది.

ఆమె చనిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టులో ఆమె గొంతును బలంగా నులమడంతో చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు.

 ఈ క్రమంలో కొండచిలువే ఆమె మరణానికి కారణమని తేలింది. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టం నివేదిక తమను ఆశ్చర్యానికి గురి చేసిందని.... పాములు పెంచుకున్న లారా జీవితం విషాదంగా ముగిసిందని పేర్కొన్నారు. 

ఇక విష రహిత పాములైన కొండచిలువలు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో ఎక్కువగా నివసిస్తాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 రకాల జాతుల కొండచిలువలు ఉన్నాయి. పోలీసులు పాముల గురించి ఆరా తీయగా... అవన్నీ ఆమె పెంపుడు పాములే అని వారు చెప్పడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios