పైలట్ నైపుణ్యం.. ఎయిర్ ఇండియాకు తప్పిన ప్రమాదం.. విజయవంతంగా ల్యాండింగ్.. (వీడియో)

ఎయిర్ ఇండియాకు లండన్‌లో పెను ప్రమాదం తప్పింది. తుఫాన్ గాలులు, బీభత్స వాతావరణం కొనసాగుతున్న తరుణంలో హీత్రో ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్లు విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఆ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో రోమాంచకంగా ఉన్నది.
 

air india pilot landed safely amid eunice storm in UK

న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితులు అనుకూలించనప్పుడు విమాన(Flight) ప్రయాణాలు ఎప్పుడూ ప్రమాదకరంగానే మారుతాయి. ముఖ్యంగా తుఫాన్ ఉన్నప్పుడు మరింత దుర్భరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని గాల్లోకి లేపడం సులువే అయినా.. ఆ తర్వాతి ప్రయాణం కత్తిమీద సాము వంటిదే. ఏ క్షణాన సిగ్నల్స్ అందకున్నా.. పరిస్థితులు చేజారిపోవచ్చు. ముఖ్యంగా ల్యాండింగ్ కీలకమైన ఘట్టంగా ఉంటుంది. పైలట్ అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవాలి. ఏ కొంచెం అదుపు తప్పినా.. పరిస్థితులు మొత్తంగా చేజారిపోతాయి. కానీ, పైలట్ నైపుణ్యం(Skill) ఇక్కడే బయటపడుతుంది. ఇలాంటి అద్భుతమే ఎయిర్ ఇండియా పైలట్ చేసి చూపించారు. అది కూడా యూరప్ దేశాన్ని యూనిస్ తుఫాన్ కుదిపేస్తున్న సమయంలో ప్రయాణమే క్లిష్టంగా ఉంటుంది. కానీ, ఈ కఠిన వాతావరణంలోనే ఎయిర్ ఇండియా(Air India) పైలట్‌(Pilot)లును యూకేలోని హీత్రో ఎయిర్‌పోర్టులో విజయవంతంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండింగ్ స్టేజ్‌లో బ్యాలెన్స్ తప్పింది. భీకర గాలులతో విమానం అటూ ఇటూ ఊగుతున్నది. అయినప్పటికీ ఆ విమానాన్ని వారు విజయవంతంగా ల్యాండ్ చేయగలిగారు.

1987 తర్వాత భీకరంగా యూనిస్ తుఫాన్ ఐరోపాను కుదిపేస్తున్నది. చాలా దేశాలు తమ విమాన ప్రయాణాలను నిలిపేశాయి. ముఖ్యంగా లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో విమానాలు ల్యాండ్ కావడం కష్టంగా మారింది. దీంతో చాలా విమానాలు ఇక్కడకు ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి. లేదా అక్కడి దాకా వచ్చి వాతావరణం అనుకూలించక వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మన దేశం నుంచి ఎయిర్ ఇండియా విమానం అక్కడకు చేరుకుంది. అక్కడి ఫ్లైట్స్ ల్యాండింగ్‌ను లైవ్‌ స్ట్రీమ్‌లో ప్రసారం చేసే బిగ్ జెట్ టీవీ ఎయిర్ ఇండియా అద్భుత ల్యాండింగ్ వీడియోను తీసింది.

ఆ ఎయిర్ ఇండియా విమాన పైలట్లు అంచిత్ భరద్వాజ్, ఆదిత్య రావులు ఉన్నారు. వారు బోయింగ్ డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా విమానాన్ని నడుపుతున్నారు. ఆ విమానం చాలా కఠిన పరిస్థితుల్లో విజయవంతంగా వారు ల్యాండ్ చేశారు. ఆ వీడియోను రికార్డు చేస్తూ బిగ్ జెట్ టీవీ కామెంటేటర్ పైలట్లపై ప్రశంసల జల్లు కురిపించారు. వారు ఎంతో నైపుణ్యం కలిగిన పైలట్లు.. విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేయగలిగారు అని పేర్కొన్నారు. ఆయన రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో యూజర్లు పోస్టు చేసి వైరల్ చేశారు. ఎయిర్ ఇండియా కూడా తమ పైలట్లను ప్రశంసించింది. ఎన్నో ఎయిర్‌లైన్లు తమ విమానాలను ల్యాండ్ చేయడానికి జంకుతున్నారని, కానీ, తమ పైలట్లు లండన్‌లో ఎయిర్ ఇండియా విమానాన్ని ల్యాండ్ చేయగలిగారని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ వీడియోను కిరణ్ బేడీ కూడా ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా పైలట్లపై ఆమె ప్రశంసలు కురిపించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios