ప్రియుడ్ని వాడుకుని వదిలేసిన ప్రియురాలు.. ‘బ్రేకప్ బిల్లు’ పంపి షాకిచ్చిన ప్రియుడు.. సోషల్ మీడియాలో వైరల్...

లవర్ బ్రేకప్ చెప్పిందని ఏడుస్తూ కూర్చోలేదు ఆ యువకుడు. తమ లవ్ మొదలైనప్పటినుంచి ఆమె మీద పెట్టిన ఖర్చంతా కక్కాలంటూ.. బ్రేకప్ బిల్లు పంపించాడు. దీనికి పక్కా ఆధారాలూ పెట్టాడు. 

After breakup with girlfriend, boy caught 7 lakh bill, goes viral in social media

నేటి రోజుల్లో ఓ వయసు వచ్చేసరికి గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో లేకపోవడం నామోషీ... అలా ఉంటే ఊరికే ఉంటారా? గర్ల్ ఫ్రెండ్ కోసం ఖరీదైన గిఫ్టులు, షాపింగులు.. ఇలా ఓ నడుస్తూనే ఉంటాయి. అయితే, సాధారణంగా అబ్బాయిలు తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. దీనికి కారణాలు లేకపోలేదు.. అది వారి నిజాయితీగల ప్రేమకు నిదర్శనంగానో.. లేకపోతే ఆ అమ్మాయి తమకే సొంతం అనే ఫీలింగ్ గానీ అబ్బాయిలు తమ దగ్గర డబ్బులు లేకపోయినా.. అప్పుడప్పుడు అప్పులు కూడా చేసి మరి ప్రేమించిన అమ్మాయికి  బహుమతులో,  నగదో ఇస్తుంటారు.  ఇక దీన్నే కొంతమంది అమ్మాయిలు అవకాశంగా తీసుకుని..  ప్రియుణ్ణి ఏటీఎం కార్డులా వాడేస్తారు. 

ఇదే తరహాలో ఓ వ్యక్తి తన ప్రియురాలు అడిగిందల్లా  కొనిచ్చాడు. అవసరమైనప్పుడల్లా అడిగినంత డబ్బు ఇచ్చాడు. అంతేకాదు ఆమె తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే ఆస్పత్రి ఖర్చులు భరించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆమె తల్లి చికిత్సపొందుతూ చనిపోయింది. అయినా బాధలో ఉన్న ప్రియురాలిని వదలలేదు.. ఆమెకు తోడుగా ఉండి అంత్యక్రియ ఖర్చులు సైతం భరించాడు. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి ఒకరోజు అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇంకేముంది ఆ సదరు ప్రేమికుడు.. దేవదాసుగా మారాడని అనుకుంటున్నారా? లేదు.. రివర్స్ లో ప్రియురాలికి షాక్ ఇచ్చాడు.  

Harsh firing in wedding: పెళ్లి బ‌రాత్ లో తుపాకీ పేల్చిన వరుడు.. ఊహించని ఘటనతో జైలు పాలు

అతను అప్పటివరకు తన ప్రియురాలి ఖర్చు పెట్టిన సొమ్ము మొత్తం డైరీలో భద్రపరిచాడు. ఆ మొత్తం బిల్లు ఆమెకు పంపించి పరిహారం చెల్లించాలని అడిగాడు. సదరు యువతికి ఆ బిల్లు మొత్తం చూసి కళ్లు బైర్లు కమ్మాయి. వీరిద్దరి మధ్య డేటింగ్ మొదలైన ఫస్ట్ నుంచి బ్రేకప్ చెప్పే ముందు రోజు వరకు అతడు ప్రియురాలికి ఇచ్చిన ప్రతి పైసా ఖర్చు చాలా క్లియర్ గా డైరీలో నోట్ చేశాడు. చిన్న మొత్తాన్ని సైతం విడిచిపెట్టలేదు. ప్రతీ బిల్లు రాసి పెట్టుకున్నాడు. 

ఇలా సుమారు వంద బిల్స్ నోట్ చేసిన ఆ వ్యక్తి  లెక్క మొత్తాన్ని చూడగా 72వేల యువాన్స్ (ఇండియన్ కరెన్సీ లో రూ.8.41 లక్షలు) తేలింది. ఇందులో కొంత కన్సెషన్ ఇచ్చిన అతనుడ 60వేల పైన యువాన్లు (ఇండియన్ కరెన్సీలో రూ.7లక్షలు) బ్రేకప్ బిల్లుగా చెల్లించాలని మాజీ ప్రియురాలికి పంపించాడు. దీనికి ఆమె నుంచి ఎలాంటి రిప్లై వచ్చిందో తెలియదు కానీ.. ప్రస్తుతం అతడి బ్రేకప్ బిల్లులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్తో హోరెత్తిస్తున్నారు. కొంతమంది అతడికి మద్దతుగా కామెంట్ చేస్తుంటే మరికొందరు అతడిని విమర్శిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios