ఒకే టాయ్ లెట్ లో ఇరుక్కున్న చిరుత పులి, కుక్క.. చివరకు
ఓ చిరుతపులి అనుకోకుండా.. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చేసింది. ఒకేసారి అంత మంది జనాలను చూసి ఆ చిరుత కాస్త బెదిరింది. ఆ చిరుతపులి తిరగడం చూసి వీధి కుక్క కూడా భయపడింది.
మంచి ఆకలి మీద ఉన్న ఓ పులికి ఆహారంగా ఏవైనా కనిపిస్తే ఏం జరుగుతుంది..? వెంటనే మీద పడి తినేస్తుంది. కదా.. అలానే ఓ చిరుత మంచి ఆకలి మీద జనవాసంలోకి వచ్చింది. ఈ క్రమంలో అనుకోకుండా.. ఆ చిరుతపులి ఓ టాయ్ లెట్ లో ఇరుక్కోవాల్సి వచ్చింది. అందులో అనుకోకుండా ఓ కుక్క కూడా ఇరుక్కుంది. ఇంకేమంది.. ఆ కుక్కని కాస్త చిరుత తినేసి ఉంటుంది అనుకుంటున్నారు కదా.. కానీ అలా జరగలేదు. కనీసం కుక్క జోలికి కూడా ఆ చిరుతపులి వెళ్లకపోవడం గమనార్హం. కానీ.. అక్కడ చిరుత ని చూసి ఆ కుక్క మాత్రం భయంతో వణికిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ కహానీ ఏంటో మీరూ ఓసారి లుక్కేయండి..
కర్ణాటక రాష్ట్రంలో ఓ చిరుతపులి అనుకోకుండా.. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చేసింది. ఒకేసారి అంత మంది జనాలను చూసి ఆ చిరుత కాస్త బెదిరింది. ఆ చిరుతపులి తిరగడం చూసి వీధి కుక్క కూడా భయపడింది. దీంతో.. అనుకోకుండా రెండు ఒకే టాయ్ లెట్ లో దాక్కున్నాయి.
ఆ కుక్కని కాస్త చిరుత తినేస్తుందని అందరూ భయపడ్డారు. కానీ అక్కడ అలాంటిదేమీ జరగకపోవడం విశేషం. టాయిలెట్‌లో చెరో మూలన నక్కాయి. కుక్క జోలికి పులి వెళ్లలేదు. పులి మీదకి కుక్క అరవలేదు. రెండూ అక్కడే దాక్కున్నాయి.
ఈలోగా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చారు. చిరుత కోసం బోను, వలలు ఏర్పాటు చేశారు. ముందుగా కుక్కను రక్షించారు. కానీ, అప్పటికే చిరుత పారిపోయింది. ఇక దాని కోసం వేట సాగిస్తున్నారు. కర్ణాటకలోని కైకాంబ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు మిర్రర్ ట్వీట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.