కరోనా వైరస్... ఇప్పుడు ఎక్కడ విన్నా అదే పేరు. కొద్దిగా జలుబు, జ్వరం వచ్చినా చాలు.. అమ్మో కరోనా లక్షణాలు అంటూ హాస్పిటల్ చుట్టూ తిరిగేస్తున్నారు. అయితే ఈ కరోనా వైరస్ కారణంగా ఓ బీర్ కంపెనీ మూసుకునే పరిస్థితికి వచ్చింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.

పూర్తి వివరాల్లోకి వెళితే... చైనాలో మొదలైన ఈ  కరోనా వైరస్ వ్యాప్తి.. ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పాకేసింది. ఇప్పటికే చైనాలో 180మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇతర దేశాల్లో ఒకటో, రెండో కేసులు నమోదయ్యాయి.

ఈ వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందుతుందో అనే భయంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. కొద్దిగా ఆ జబ్బు లక్షణాలు ఉన్నాయి అని తెలిసినా పరీక్షలు చేయడం.. ప్రజలను అలర్ట్ చేయడం మొదలుపెట్టారు. 

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీ, లక్నో ఇలా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా దీనిపై పరిక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. చైనా నుంచి ఎవరైనా వస్తున్నారంటే చాలు.. వారిని విమానాశ్రయంలోనే ఆపేసి  రక రకాల పరీక్షలు చేస్తున్నారు.  అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. 

Also read కేరళ నర్స్ కి కరోనా వైరస్.... సౌదీకి కూడా పాకేసింది.

కరోనా బీర్ పేరు వినే ఉంటారు. ఈ బీర్ కంపెనీ కరోనా వైరస్ కారణంగా నష్టాలను చవిచూస్తోంది. దానికి కారణమేంటో తెలుసా... ఆ బీర్ పేరు కరోనా అని పెట్టడమే. 
ఈ బీరు ఖరీదు కూడా కాస్త ఎక్కువే. అన్ని బ్రాండ్లతో పోలిస్తే దీని క్వాంటిటీ కూడా తక్కువగానే ఉంటుంది.

అయితే కరోనా వైరస్ దెబ్బకు కరోనా బ్రాండ్ బీర్ తాగడం మానేశారు జనం. కరోనా పేరు చూసి... ఇది తాగితే కరోనా వైరస్ వస్తుందనే అనుమానంతో వీళ్లు ఇలా చేస్తుండటం విశేషం.  ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్ వస్తుండటం విశేషం. జియో వైరస్ వస్తే జియో సిం లు తీసి పక్కన పడేస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు పలువురు. టాటా వైరస్ వస్తే టాటా వస్తువుల వాడకం ఆపేస్తారా అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ వైరస్ దెబ్బకు జనాల్లో ఎక్కడ లేని భయాలు బయటకు వస్తున్నాయి.