Asianet News TeluguAsianet News Telugu

రూ.14లక్షలు తీసుకెళ్లి.. చెత్తకుప్పలో వేశారు

ఇద్దరు భార్యభర్తలు చనిపోయిన వ్యక్తి ఇంటిని శుభ్రం చేశారు. ఈ క్రమంలో వారికి అట్టపెట్టలు కనిపించాయి. అందులో ఏముందో చూడకుండానే వారిద్దరూ దానిని చెత్తగా భావించారు.

A Couple Unwittingly Threw Away $20,000. The Dump Gave It Back.
Author
Hyderabad, First Published Jan 2, 2020, 11:10 AM IST

 ఓ వ్యక్తి  డబ్బుల కట్టలు ఇంట్లోని బాక్సుల్లో భద్రంగా దాచుకుంటే... అతను పోయాక అతని బంధువులు వాటిని చెత్తకుప్పలో పడేశారు. దాదాపు రూ.14లక్షల నగదు వారు పడేయడం గమనార్హం. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఇంగ్లాండ్ లోని బర్నమ్ ఆన్ సీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అతని ఇంటికి వచ్చిన బంధువులైన ఇద్దరు భార్యభర్తలు చనిపోయిన వ్యక్తి ఇంటిని శుభ్రం చేశారు. ఈ క్రమంలో వారికి అట్టపెట్టలు కనిపించాయి. అందులో ఏముందో చూడకుండానే వారిద్దరూ దానిని చెత్తగా భావించారు.
 
వెంటనే వాటిని రీసైక్లింగ్ సెంటర్ కి పంపించారు. అక్కడి సిబ్బంది ఈ అట్టపెట్టలను రీసైక్లింగ్ చేసేందుకు తరలించేముందు వాటిని తెరచి చూశారు. కాగా... అందులో వారికి 15వేల పౌండ్లు( భారత కరెన్సీలో రూ.14లక్షలు) కనిపించాయి. దీంతో.. వారు తొలుత షాకయ్యారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

అక్కడకు వచ్చిన పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఆధారంగా ఈ అట్టపెట్టెలు అప్పగించిన జంటకు సంబంధించిన ఫోను నంబరు తెలుసుకున్నారు. తరువాత ఆ నగదును వారి ఇంటికి పంపించారు. అయితే పోలీసులు ఆ జంటను ప్రశ్నించగా ఆ ఇంటిలో ఉంటున్న తమ బంధువు మృతి చెందాక, ఇంటిని శుభ్రం చేశామన్నారు. అతను అట్టపెట్టెల్లో డబ్బు దాస్తాడన్న సంగతి తమకు తెలియదన్నారు. కాగా ఈ నగదు గురించిన సమాచారాన్ని తెలియజేసి, తమలోని నిజాయితీని చాటుకున్న రీసైక్లింగ్ సెంటర్ సిబ్బందిని పోలీసులు అభినందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios