బాబోయ్.. పైలట్ నడుమును తాకుతూ సీటు కిందికి చేరిన నాగుపాము...విమానం గాల్లో ఉండగా ఘటన...
ఓ విమానం గాల్లో ఎగురుతోంది. గమ్యస్థానానికి చేరడానికి ఇంకా సమయం ఉంది. ఇంతలో ఓ నాగుపాము పైలట్ సీటు కిందికి దూరింది. అది పైలట్ చూశాడు.
దక్షిణాఫ్రికా : గాల్లో విమానం ఎగురుతుంది. ఇంతలో అనుకోని విధంగా కళ్ళముందు ఓ విష సర్పం ప్రత్యక్షమైంది.. ఇదేదో సినిమా సీన్ అనుకోకండి.. నిజంగా దక్షిణాఫ్రికాలో నిజంగా జరిగింది. ప్రయాణికుడి ముందు ప్రత్యక్ష మైతే సీట్లో నుంచి లేచి అటు, ఇటు దూకి హంగామా చేస్తారు. అదే విమానం నడుపుతున్న పైలట్ విషయంలో జరిగితే?... ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా. కానీ అలాంటిదే జరిగింది దక్షిణాఫ్రికాకు చెందిన ఓ విమానంలో. దక్షిణాఫ్రికాలోని వార్సె స్టర్ నుంచి నెల్స్ ప్రీట్ కు ఓ చిన్న విమానం బయలుదేరింది. అందులో పైలెట్ తో పాటు నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు.
విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు.. టేకాఫ్ అయ్యింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలని దీక్షగా ఫ్లైట్ ను నడుపుతున్న పైలట్ ఎరామస్ కి కాసేపటికి తన నడుము వద్ద ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. అదేంటో అని చూసిన అతని మైండ్ బ్లాంక్ అయింది. తన సీటు కిందికి దూరుతూ ఓ నాగుపాము కనిపించింది. అది చూసిన ఎవరైనా వెంటనే అక్కడి నుంచి పారిపోతారు…కానీ, ఎరామస్ తనతో పాటు మరో నలుగురి ప్రాణాలని ప్రమాదంలో పెట్టదలచుకోలేదు.
చిలిపి పిల్లి.. రంజాన్ ప్రార్థనలు చేస్తుంటే ఇమామ్ మీద దూకుతూ అల్లరి.. వైరల్
అందుకే భయపడకుండా ఉన్నాడు. పాము పూర్తిగా సీటు కిందికి చేరిన తర్వాత ధైర్యం కూడగట్టుకుని…గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించాడు. వారి సూచనలతో విమానాన్ని జోహన్నెస్ బర్గ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటికి దిగిన తర్వాత పైలెట్ సీటు కింద చూస్తే నాగుపాము చుట్ట చుట్టుకుని పడుకుని ఉంది. అయితే, వార్సెస్టర్ ఎయిర్పోర్టు సిబ్బంది ప్రయాణానికి ముందే ఈపాముని గుర్తించారట. విమానం రెక్కల కింద అది కనిపించింది. కానీ పట్టుకునే ప్రయత్నం చేసే లోపే తప్పించుకుని పారిపోయింది. తెల్లారి కాక్ఫిట్ లో ప్రత్యక్షమైంది.
విమానం జోహన్ నెస్ బర్గ్లో అత్యవసర లాండింగ్ అయ్యాక కూడా పామును పట్టుకునేందుకు సిబ్బంది శతవిధాలా ప్రయత్నించారు. చిన్న విమానం కావడంతో మొత్తం ఎక్కడికి అక్కడ ఊడదీసి చూసిన పాము దొరకలేదట. అప్పటికే రాత్రి కావడంతో వెతకడం ఆపి పాము కోసం విమానం చుట్టూ ఆహారాన్ని ఎరగా వేసి పెట్టారు. అయితే ఆహారాన్ని పాము ఏ మాత్రం తాకలేదు. దీంతో పాము విమానం నుంచి వెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నారు. పైలెట్ ధైర్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని.. లేదంటే విమానం అదుపుతప్పి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు.