శభాష్ బామ్మ.. 40 అడుగుల ఎత్తైన బ్రిడ్జినుంచి గంగానదిలోకి జంప్.. 73యేళ్ల వృద్ధురాలి సాహసం... వీడియో వైరల్

73 ఏళ్ల ఓంవతి మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి నదుల్లో ఈత కొడుతున్నానని, తన వెంట ఎవరూ వెళ్లకుండా చూసుకున్నానని చెప్పారు.

73 years old haryana woman dives from 40 foot bridge Into ganga river

న్యూఢిల్లీ : 70యేళ్లు దాటాయంటే ఎవరైనా ఏం చేస్తారు. అనారోగ్యంతో మంచం పట్టడంతో.. లేదంటే ఇంటికే పరిమితం కావడమో కామన్.. కానీ ఈ బామ్మ దానికి భిన్నం.. 73 యేళ్ల వయసులో కూడా నదుల్లో ఈత కొడుతోంది. దీనికోసం ఎత్తైన వంతెనల మీదినుంచి నదుల్లోకి డైవ్ చేసి మరీ ఈత కొడుతోంది. ఆమెను చూసి ఇప్పుడు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. 

హర్యానాలోని సోనేపట్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు ఒకరు బ్రిడ్జిపై నుంచి గంగా నదిలోకి దూకి చేసిన సాహసాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. హరిద్వార్‌లోని హర్ కీ పౌరి వద్ద 40 అడుగుల ఎత్తైన వంతెనపై నుంచి ఆమె గంగానదిలోకి దూకిన వీడియో వైరల్‌గా మారింది.

హర్ కీ పౌరి వద్ద బ్రిడ్జిపై నుంచి ఆ వృద్ధురాలు దూకి హాయిగా గంగా నదిలో ఈత కొడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. మొదట ఆమె నదిలో దూకడానికి ముందు వంతెన గ్రిల్ నుంచి నదివైపుకు దిగుతుంది. అక్కడినుంచి ఓ యువకుడి ఇన్ స్ట్రక్షన్స్ సహాయంతో... వేగంగా పారుతున్న నీటి ప్రవాహంలోకి దూకేస్తుంది. ఆ తరువాత  ప్రవాహం ఉదృతంగా ఉన్నప్పటికీ హాయిగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడం కనిపిస్తుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలను సృష్టించింది. కొంతమంది నెటిజన్లు ఆ మహిళ ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు ఆమె అలా దూకడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.నదిలోకి దూకిన మహిళ పేరు ఓంవతి. 73 ఏళ్ల ఆమె మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి నదుల్లో ఈత కొడుతున్నానని, తన వెంట ఎవరూ రాకుండా చూసుకున్నానని చెప్పారు.

నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆమె సహాయం లేకుండా సురక్షితంగా నది ఒడ్డుకు చేరుకుంది. ఆమె అద్భుతమైన స్విమ్మర్ అని దీంతో రుజువయ్యింది. చిన్నప్పటినుంచి ఆమెకు ఇది మామూలేనట. చిన్నతనంలో నదులు, చెరువుల్లో ఈత కొట్టిన అనుభవం ఇప్పుడిలా తనతో చేపిస్తుందని ఆమె చెబుతోంది. హర్యానాలోని బందేపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ఓంవతికి  డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios