ఇటీవల ఆమెకు నిజమైన ప్రేమ దక్కిందట. కరోనా మహమ్మారి సమయంలో.. తనకు ఓ వ్యక్తి దగ్గరయ్యాడని.. ఆమె ట్విట్టర్ లో పేర్కొంది. కాగా.. ఆమె ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట  వైరల్ గా మారాయి. ఈ బామ్మ ప్రేమ కథలోకి వెళితే...

ప్రేమకు వయసుతో పనేముంది. ఈ వయసులోనే మనసులో ప్రేమ పుట్టాలి అని రూల్ ఎక్కడా లేదు. మన మనసుకు నచ్చిన వ్యక్తి.. ఏ వయసులో అయినా మనకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓ 73ఏళ్ల బామ్మ విషయంలోనూ అదే జరిగింది. ఇటీవల ఆమెకు నిజమైన ప్రేమ దక్కిందట. కరోనా మహమ్మారి సమయంలో.. తనకు ఓ వ్యక్తి దగ్గరయ్యాడని.. ఆమె ట్విట్టర్ లో పేర్కొంది. కాగా.. ఆమె ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ బామ్మ ప్రేమ కథలోకి వెళితే...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమెరికా కు చెందిన కార్ల్ హెచ్. మ్యాక్ అనే మ‌హిళ ఇటీవల ప్రేమలో పడింది. అయితే.. అప్పటికే ఆమెకు పెళ్లైపోయింది. ఈ ప్రేమ కోసం ఆ పెళ్లి బంధాన్ని ఆమె తుంచుకోవడం గమనార్హం. అలాగే ప్రేమించిన వ్య‌క్తితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఈ విషయాన్ని కార్ల్ హెచ్ . మార్క్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. జీవితం చాలా విచిత్ర‌మైనది. దాదాపు నాలుగు ద‌శాబ్ధాల పెళ్లి జీవితాన్ని తెంచుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ఒక సింగ‌ల్ గా మారాను.

Scroll to load tweet…

అలాగే ఊహించ‌ని ప్రేమ‌కు ద‌గ్గ‌ర అవుతున్నాను. అంటూ త‌న ఎంగేజ్ మెంట్ రింగ్ తో ట్విట్ట‌ర్ లో పోస్టు చేసింది. ఈ ట్వీట్ పోస్టు చేసి మూడు, నాలుగు రోజులు అవుతోంది. అయితే.. వాలంటైన్స్ డే రోజున ఈ ట్వీట్ మరింత వైరల్ గా మారడం గమనార్హం. ప్రేమ కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ బామ్మ తన కథతో.. ప్రేమకు వయసు లేదు అని మరోసారి రుజువు చేసింది.