అర్థరాత్రి.. 19యేళ్ల యువకుడు, పదికిలోమీటర్లు పరుగు.. ఎందుకో తెలిస్తే.. అబ్బురపడతారు.. వైరల్ గా మారిన వీడియో...
ఓ యువకుడు అర్థరాత్రి నోయిడా రోడ్ల మీద అలుపెరగకుండా పరుగులు పెడుతున్నాడు. ఎందుకలా? అని అడిగితే అతడు చెప్పిన సమాధానం... అతని ధైర్యం, హాయిగా నవ్వుతూ కష్టాన్ని అధిగమిస్తున్న అతని తీరు.. నేటి యువతకు స్పూర్తి దాయకం.. ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన విషయం..
నోయిడా : ఒక యువకుడు.. అర్ధరాత్రి Noidaలోని రోడ్ల మీద running చేస్తున్నాడు.. ఈ వీడియోను ఆదివారం సాయంత్రం Social mediaలో ఓ వ్యక్తి అప్ లోడ్ చేశాడు. ఇది పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వేలాది మంది ఈ వీడియోను చూశారు. ఆ కుర్రాడి మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎందుకు పరిగెత్తుతున్నాడు? తెలియాలంటే..
ఈ వీడియోను చిత్రనిర్మాత, రచయిత vinod kapri తన Twitter accountలో పోస్ట్ చేశారు. అర్థరాత్రి పూట వినోద్ కప్రీకి రోడ్డు మీద చెమటతో తడిసి ముద్దయినా, ఆపకుండా రన్నర్ చేస్తున్న యువకుడు కనిపించాడు. దీంతో అతని మనసు కరిగి కారులో నుంచే అతన్ని పలకరించాడు. చెమటలు కక్కుతూ ఎందుకలా పరిగెత్తడం తన కారులో డ్రాప్ చేస్తానని ఆఫర్ చేశాడు. కానీ ఆ కుర్రాడు చాలా స్మూత్ గా దాన్ని తిరస్కరించాడు.
ఈ వీడియోను షేర్ చేస్తూ.. స్వచ్ఛమైన బంగారం అంటూ హెడ్డింగ్ పెట్టాడు. 19యేళ్ల ఆ కుర్రాడు అర్థరాత్రిపూట 10 కిలోమీటర్లు తన డ్యూటీనుంచి ఇంటికి పరుగెత్తుతూ వెడుతుంటూ.. వినోద్ కప్రీ అతనితో సరదాగా మాటలు కలిపారు. యువతకు ఎంతో స్పూర్తి దాయకం అని తెలియజేస్తూ ఈ వీడియోను షేర్ చేశారు.
వీడియోను, కప్రీ తన కారులో నుండి చిత్రీకరించారు. యువకుడితో సమానంగా కారును పోనిస్తూ దీన్ని చిత్రీకరించారు.మెక్‌డొనాల్డ్‌లో పనిచేస్తున్న ఆ యువకుడు తన షిఫ్ట్ తర్వాత ఇంటికి పరిగెడుతూ వెడుతున్నాడు. లిఫ్ట్ ఇస్తానన్న వినోద్ కఫ్రీ ఆఫర్ చేస్తే.. పరిగెత్తడానికి తనకు దొరికే సమయం ఇదొక్కటేనని, ఇది తనకు ఇష్టమైన వ్యాపకం అని సున్నితంగా తిరస్కరించాడు. ఇంత అర్థరాత్రి ఎందుకు పరిగెత్తుతున్నావ్.. అని అడిగితే.. తనకు సైన్యంలో చేరాలని ఉందని.. దానికోసం ప్రాక్టీస్ లో భాగంగా ఇలా పరిగెడుతున్నానని చెప్పాడు. ఉదయం పరిగెట్టొచ్చు కదా అంటే.. డ్యూటీకి పొద్దున్నే వెళ్లాలని టైం దొరకదని తెలిపాడు.
ఈ సంభాషణ మధ్యలో కప్రీ మరోసారి బాలుడిని డ్రాప్ చేస్తానని ఆఫర్ చేశాడు. కానీ అతను మళ్లీ నిరాకరించాడు. అతను ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పనికి వెళ్లాలి. దీనికోసం ఉదయాన్నే లేచి వంటచేసి పెట్టి వెళ్లాలి. అందుకే వ్యాయామానికి సమయం ఉండదని తెలిపాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన మెహ్రా, నోయిడాలోని సెక్టార్ 16లో తను ఉద్యోగం చేసే చోటు నుండి బరోలాలోని తన ఇంటి వరకు ప్రతిరోజూ 10-కిమీల దూరం పరిగెడతాడు. అక్కడ అతను తన సోదరుడితో కలిసి ఉంటున్నాడు. అతని తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని తెలిపాడు.
వినోద్ కప్రీ, అతడిని ఫాలో అవుతూనే మెహ్రాను ఇంకా ఫాలో అవుతూ.. ఈ క్లిప్ వైరల్ అవుతుంది అనగానే.. అతను నవ్వుతూ.. "నన్ను ఎవరు గుర్తుపడతారు?" అంటూ నవ్వుతాడు. అయినా, అది వైరల్ అయితే ఫర్వాలేదు, నేనేం తప్పు పని చేయడం లేదు కదా.. అంటూ హాయిగా నవ్వేశాడు.
మధ్యలో ఇంటికి వెళ్లి వంట చేయాలని చెప్పినప్పుడు.. వినోద్ కప్రీ..నాతో రా డిన్నర్ చేసి వెడుదువూ అని ఆఫర్ ఇస్తే.. మరి ఇంట్లో తమ్ముడు ఆకలితో ఉండిపోతాడు కదా.. అని ప్రశ్నిస్తాడు. అన్న ఉన్నాడు కదా అని ప్రశ్నిస్తే.. తన అన్న నైట్ షిఫ్ట్ లో ఉంటాడని.. తనకోసం వంట చేయాలంటే కష్టం అని చెబుతాడు.
చివరగా బాలుడికి శుభాకాంక్షలు తెలుపుతూ, వినోద్ కప్రీ వీడియోను షేర్ చేస్తూ "ప్రదీప్ కథ మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఐదు గంటల్లోనే, 1.8 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. 100,000 లైక్‌లు వచ్చాయి. ఈ క్లిప్‌పై వెంటనే వైరల్ కావడంతో ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా మారింది.