ఈ చిచ్చరపిడుగుని చూశారా..? సరిగ్గా ఐదు మహా అయితే ఆరు సంవత్సరాలు ఉంటాయేమో. మన విద్యా సంస్థపై అంత ఎత్తున ఎగిరిపడుతోంది. తనకు రోజూ స్కూల్ కి వెళ్లాలంటే ఎంత కష్టంగా ఉందో చెబుతూనే.. ఓ నెల రోజులు తనకు స్వేచ్ఛ కావాలంటోంది. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... సాధారణంగా చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లడానికి మోరాయిస్తూ ఉంటారు. స్కూల్ వద్దూ అంటూ ఏడుస్తుంటారు. అయితే.. ఈ వీడియోలో చిన్నారి ఏడ్చే రకం కాదు.. అసలు ఏంటి విద్యావిదానం అంటూ చెడమడా ఏకిపారేస్తోంది. పొద్దునే నిద్ర లేపుతారని.. లేవగానే బ్రష్ చెయ్యి, పాలు తాగు, స్నానం చెయ్యి, స్కూల్ కి వెళ్లూ అంటూ ఇంట్లో  కంగారుపెడుతూనే ఉంటారని చెప్పింది.

 

ఇక స్కూల్ కి వెళ్లాక.. ముందు ప్రేయర్, ఆ తర్వాత ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, ఆ తర్వా గుజరాత్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పి చంపుతారని అంటోంది. అసలు ఈ స్కూలింగ్ విధానాన్ని కనిపెట్టిన వాడు కనపడితే ఏం చేస్తావ్ అంటే... ఆ మనిషిని శుభ్రంగా ఉతికి.. నీటిలో ముంచి.. ఆ తర్వాత ఇస్త్రీ చేస్తానంటూ చెప్పడం విశేషం.

కాగా.. చిన్నారి కామెంట్స్ ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ‘ఈ ప్రపంచంలో మొట్టమొదటగా స్కూలింగ్ విధానాన్ని కనిపెట్టిన వ్యక్తి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. అతని కోసం ఈ చిన్నారి వెతుకుతోంది’ అనే క్యాప్షన్ పెట్టి అరుణ్ అనే వ్యక్తి  సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.