ఆ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు...చెన్నై ఐఐటీ వ్యతిరేకం: ఎమ్మెల్యే ధర్మశ్రీ
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని...గతంలో ఆయనకు మద్దతిచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు.
జెఏసి ముసుగులో మాజీ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో ఉద్యమం చేయిస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆంకాంక్షకు అతడు అడ్డుతగులుతున్నాడని... ఆ ప్రాంతమంటే ఆయనకు ఎందకంత కక్ష్యో తెలియడంలేదన్నారు. ఒక ఉన్మాది మాదిరిగా వ్యవహరిస్తూ ఉత్తరాంద్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని మండిపడ్డారు.
గతంలో ఉత్తరాంద్ర ప్రజలు చంద్రబాబుకు అండగా నిలిచారని... అలాంటి వారి మనోభావాలను దెబ్బతీయడం మంచిదికాదన్నారు. ఆయనకు పోయేకాలం దగ్గరకు వచ్చింది కాబట్టే ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
రాజధానిగా అమరావతి అనుకులమైంది కాదని గతంలోనే చెన్నై ఐఐటీ చెప్పిందని గుర్తుచేశారు. జోలె పడితే ప్రజల్లో తనపై జాలి వస్తుందనే ఆయన రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంద్ర, రాయలసీమ అంటే ఆయనకు అంత కడుపు మంటఎందుకో అంటే ధర్మశ్రీ విమర్శించారు.
తన బినామీ భూములు ఉత్తరాంధ్రలో లేవనే చంద్రబాబు ఆ ప్రాంతంలో రాజధానిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తనకు అనుకూలమైన రెండు వార్తాపత్రికలతో ఉత్తరాంద్ర, రాయలసీమలపై ఆయన విషం కక్కుతున్నారని అన్నారు. ఆ రెండు వార్తాపత్రికలు ఏమిటో అందరికీ తెలుసని... ఆ యాజమాన్యాలు ఆలోచించి వార్తలు రాస్తే మంచిదని సూచించారు.
read more ఏపి రాజధానిపై గందరగోళం... హైపవర్ కమిటీ ఆలోచన ఇదే
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఇలా ఇక్కడ టిడిపి పార్టీకి సీట్లు రాలేవన్న కోపంతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
వైజాగ్ రాజధానిగా వస్తే రాష్ట్రానికి ఆదాయం సమకూరడమే కాదు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. అతి తక్కువ ఖర్చుతోనే రాజధానికి అవసరమైన ఏర్పాట్లన్ని పూర్తి అవుతాయన్నారు. చంద్రబాబు ప్రాంతాలు మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు.
ఉత్తరాంద్ర, రాయలసీమల వెనుకబాటుకు చంద్రబాబే ముఖ్య కారణమని ఆరోపించారు. పరిపాలన అభివృద్ధి ద్వారా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు.
read more పవన్ కల్యాణ్ డిల్లీ పర్యటన... చంద్రబాబు కోసమేనా...?: ఎమ్మెల్యే గోపిరెడ్డి
సీపీఐ నేత నారాయణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు రాజధానిపై అంత ప్రేమే ఉంటే పక్కరాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును తెలివిలేని వాడిగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. గొప్పల కోసం అప్పులు చేసిన ఆయన చివరకు అమరావతిలో గ్రాఫిక్స్ మాత్రమే చూపించారన్నారు.
విశాఖపట్నంను ముంబైతో సమానంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం వుందని ధర్మశ్రీ అన్నారు. రాయలసీమలో హైకోర్టు పెడితే నాలుగు జిరాక్స్ మిషన్లు వస్తాయని కొందరు రాయలసీమ ప్రాంతాన్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయాడు కాబట్టి ఉత్తరాంద్ర పై విద్వేషం చూపిస్తున్నాడని అన్నారు. పవన్, చంద్రబాబు వేర్వేరు కాదని... వీరిద్దరరు ఒక్కటే ఆలోచనను కలిగివున్నారని వైసిపి ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆరోపించారు.