ఏపి రాజధానిపై గందరగోళం... హైపవర్ కమిటీ ఆలోచన ఇదే

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో త్వరలో కేబినెట్ భేటీ, అసెంబ్లీ  ప్రత్యేక సమావేశాలు జరపనున్నట్లు ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించిన  విషయం తెలిసిందే. తాజాగా ఆ సమావేశాలు వాయిదాపడే అవకాశాలున్నట్లు  తెలుస్తోంది.  

AP Capital issue...  final decision of government may postponed

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ల నివేదికలు ప్రభుత్వం వద్దకు చేరగా వీటి అద్యయనం కోసం మంత్రులతో ఏర్పాటుచేసిన  హైపవర్ కమిటీ  నివేదిక అందించాల్సి వుంది. హైపవర్ కమిటీ నివేదిక తర్వాతే ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై  ప్రభుత్వం తుది నివేదిక తీసుకోనుంది. 

అయితే ఈ హై పవర్ కమిటీ నివేదిక ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వం వర్గాల నుండి సమాచారం అందుతోంది. త్వరలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమై పూర్తి నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం తీసుకోనున్న తెలుస్తోంది. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించిన కీలక నిర్ణయం కాబట్టి హడావుడిగా కాకుండా సమగ్ర నివేదికను జాగ్రత్తగా రూపొందించాలన్నది మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ ఆలోచనగా తెలుస్తోంది.

read more  అమరావతిలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ: ఎమ్మెల్యే అరెస్ట్

 ఈ నెల 17న జరిగే క్యాబినెట్ భేటీ  కూడా వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  రాజధానిపై చర్చించేందుకు ప్రత్యేకంగా  ఏర్పాటుచేయాలనుకున్న అసెంబ్లీ సమావేశం కూడా వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ నెల 17వ తేదీ లోపుగా రాజధాని రైతులు తమ సమస్యలు, సూచనలు ఇవ్వాలని హై పవర్ కమిటీ రాజధాని రైతులకు సూచించింది. సోమవారం నాడు రాజధాని కోసం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 17వ తేదీలోపుగా రాజధాని రైతులు తమ సమస్యలను నేరుగా సీఆర్‌డీఏకు చెప్పాలని  హైపవర్ కమిటీ సూచించింది.

రాజధాని రైతులు తమ  సమస్యలను, సలహాలను, సూచలను సీఆర్‌డీఏ దృష్టికి తీసుకురావాలని  హైపవర్ కమిటీ కోరింది.  ఈ నెల 17వ తేదీ సాయంత్రం మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. రైతుల సమస్యలు, సూచనలపై హైపవర్ కమిటీ చర్చించనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios