అమరావతి: కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడమే కాకుండా ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయకపోవటం ఎంత వరకు సమంజసమని తాము మొదటి నుండి రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ప్రశ్నిస్తూనే ఉన్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అయితే తాజాగా ఈసీ వ్యవహారశైలిని దేశ అత్యున్నత న్యాయస్థానమే తప్పుబట్టిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమీషన్ విచక్షణాధికారాల పేరిట నిర్ణయం తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. 

ఎన్నికల కోడ్ ఎత్తేయాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించడం మంచి పరిణామమని అన్నారు. ఎన్నికల కోడ్ ను అడ్డంపెట్టి టీడీపీ ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుందని అన్నారు. ఇప్పుడే కాదు రాష్ట్రంలో ఎప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం పెరుగుతుంది తప్ప తగ్గేదన్నారు. 

read more  విశాఖకు వెళ్లడానికి సిద్దంగా వుండాలి...సెక్రటేరియట్ ఉద్యోగసంఘం కీలక నిర్ణయం

ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే తప్ప ఎన్నికల కోసం పథకాలను కొత్తగా పెట్టలేదన్నారు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇస్తామని మొదటి రోజే సీఎం జగన్ చెప్పారని... దాన్ని ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదన్నారు.  

అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎంతకాలం ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటారు అంటూ టిడిపిని, చంద్రబాబు నాయుడిని మంత్రి ప్రశ్నించారు. సుప్రీంకోర్టే ఎన్నికలు వాయిదా వేసింది కాబట్టి కేంద్ర నిధులు తెచ్చుకుని తిరుతామన్నారు మంత్రి వెల్లంపల్లి.