అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సచివాలయ ఉద్యోగుల సంఘం సమర్థించింది.  బుధవారం జరిగిన ఉద్యోగ సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో విశాఖపట్నంను పరిపాలన రాజధానికి ఏర్పాటుచేయడం... ఉద్యోగులు  ఎదుర్కునే సమస్యలపై చర్చించినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ... అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్ ఎక్సిక్యూటివ్ కేపిటల్ గా ప్రభుత్వం నిర్ణయం  తీసుకుందని అన్నారు. దీనిపై చర్చించడానికే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించామని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తూ పరిపాలన రాజధాని వైజాగ్ కు వెళ్ళడానికి ఉద్యోగులు రెడీగా ఉండాలని ఆయన సూచించారు. 

read more  వైఎస్ జగన్ కు షాక్: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

అయితే వైజాగ్ లో ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వసతి సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాట్లు చెయ్యాలని కోరారు. మే 31 లోపు ఉద్యోగులను విశాఖపట్నానికి తరలించాలని సూచించారు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఉన్నాయని... వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేకపోయామని  వెంకటరెడ్డి వెల్లడించారు.