కరెంట్ తీగలు పట్టుకుని ప్రాణత్యాగానికి సిద్దమే...: దేవినేని ఉమకు మాజీ హోంమంత్రి సవాల్
మాజీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వర రావు తీవ్ర విమర్శలు చేశారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విసిరారు.
విజయవాడ: తనపై మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు చేసిన విమర్శలపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వర రావు ధీటుగా స్పందించారు. తాను పదవిలో వుండగా లంచాలు తీసుకున్నానని ఆరోపించిన ఉమ దమ్ముంటే దాన్ని నిరూపించాలని... అలా రుజువు చేస్తే కరెంటు తీగలను పట్టుకుని ప్రాణత్యాగానికి సిద్దమే... నిరూపించు నా కొడకా అంటూ సవాల్ విసిరారు.
తానేదో గొప్ప వ్యక్తిని అని చెప్పకునే ఉమను స్వయానా తమ్ముడే లెక్కచేయడని... ఇతడి ఇంట్లో అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడడని అన్నారు. దేవినేని వెంకటరమణ కూతుళ్లు కూడా ఆయన ఇంటికి రారని... కుటుంబంలో ఉమ పరిస్థితి ఇదని నాగేశ్వర రావు మండిపడ్డారు.
దేవినేని ఉమకు మర్యాద తెలియదని అన్నారు. పెద్దా చిన్న తేడాలేకుండా మాట్లాడుతుంటాడని... అందువల్లే దేవినేని కుటుంబం అతడికి దూరంగా వుండాలని చూస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనను ఏదైనా శుభకార్యానికి పిలవాలన్న భయపడతారని... పక్కవాడు తెల్ల బట్టలు వేసుకున్న ఓర్వలేని లేబర్ అతడంటూ విరుచుకుపడ్డారు.
అతడిని ఓడించి కృష్ణ ప్రసాద్ ని గెలిపించడంతో తన కోరిక నెరవేరిందని నాగేశ్వరరావు తెలిపారు. కృష్ణ ప్రసాద్ రాజధాని ఇక్కడే వుండటం ఇష్టమని... కానీ పార్టీ విధానాన్ని వ్యతిరేకించనని ఎప్పుడో చెప్పాడని గుర్తుచేశారు.
read more సిట్ ఏర్పాటుతో చంద్రబాబు గుండెల్లో గుబులు... ఆ ప్రయత్నాలు అందుకే ..: కోటంరెడ్డి
దేవినేని కుటుంబం ఎప్పుడో ఉమను వెలివేసిందన్నారు. ఆయన గత టిడిపి హయాంలో ఇరిగేషన్ శాఖలో ఎంత తిన్నాడో అందరికీ తెలుసని... ఇప్పటివరకు చేసిన అవినీతి, అక్రమాల కారణంగా అతడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తే అతడి బండారం బయట పడుతుందన్నారు. ఇలాంటి దాడుల నుండి బయటపడేందుకు వజ్రాల రూపంలో తన అక్రమార్జనను సూట్ కేసుల్లో దాచి వుంచాడని ఆరోపించారు.
read more నిరుద్యోగ యువత, విద్యార్థులకు నిలువునా మోసం...: జగన్ సర్కార్ పై మాజీ మంత్రి ఆగ్రహం
''రా వెదవ.. నీ బతుకు సోడాలతో ప్రారంభిమైనది. అలాంటి నువ్వు నాపై విమర్శలు చేస్తావా పంది నా కొడక. బురదలో తిరిగే పంది. నీ తండ్రి శ్రీమన్నరాయణకి ఎలా పుట్టావో కానీ నీ బతుకు మెత్తం ఇసుక మాఫియాతోనే ముడిపడి వుంది. నా గురించి, కుటుంబం గురించి మాట్లాడేటపుడు నోరు అదుపులోకి పెట్టుకో'' అంటూ మాజీ హోంమంత్రి నాగేశ్వరరావు హెచ్చరించారు.