గుంటూరు: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచే ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం అరాచకానికి  తెరతీసిందని... ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చినప్పటినుంచీ కోడ్ తో పాటు అరాచకాలు కూడా కొనసాగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  

''ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజే.. ముఖ్యమంత్రి నేతృత్వంలో దౌర్జన్యకాండ కూడా దానికి సమాంతరంగా సాగుతోంది. ప్రభుత్వ దౌర్జన్యాలపై టీడీపీ ఎన్నికల కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొవడంతో పాటు కరోనా వైరస్ ప్రభావాన్ని గ్రహించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది'' అని అన్నారు.

read more  మాచర్లలో కలకలం... జర్మనీ వెళ్లొచ్చిన మహిళకు కరోనా లక్షణాలు

''కరోనా వైరస్ గురంచి ఈ ప్రభుత్వానికి ఆట్టే తెలియదు. దాని గురంచి జగన్ కు తెలిసిఉంటే పారాసిట్మాల్ వేసుకుంటే అది పారిపోతుందని... గుప్పెడు బ్లీచింగ్ పౌడర్ వైరస్ పై వేస్తేచాలు అది దౌడు తీస్తుందని చెప్పేవాడా? ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసి ప్రపంచమంతా నవ్వుకుంటోంది. చైనాలో, జపాన్ లో, అమెరికాలో, ఇటలీలో, ఇంగ్లాండ్ లో అన్నిచోట్లా జగన్ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాఫింగ్ స్టక్ లా మారింది.  జగన్ వ్యాఖ్యలతో రాష్ట్రాన్ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. చైనా, జపాన్, ఇటలీ దేశాలనుంచి డాక్టర్ల బృందం ముఖ్యమంత్రి కోసం రాష్ట్రానికి వస్తోంది'' అని ఎద్దేవా చేశారు. 

''ప్రజారోగ్యంపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి... ప్రజలను చిన్నచూపు చూస్తోందనడానికి ముఖ్యమంత్రి కార్యదర్శి పీవీ.రమేశ్ వ్యాఖ్యలే నిదర్శనం. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ రాష్ట్రప్రభుత్వం ఈసీ లక్ష్యంగా ఆయనపై ముప్పేటదాడి ప్రారంభించింది. రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా అని ప్రశ్నించడానికే విలేకరులు ముందుకొచ్చా'' అని తెలిపారు.

read more  ప్రధానితో సీఎంల వీడియో కాన్ఫరెన్స్...మోదీని జగన్ కోరిందదే: ఆళ్ల నాని

''ఈ రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా..అచేతనంగా ఉన్నాయా? ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ని ఉద్దేశించి ముఖ్యమంత్రి సహా ప్రభుత్వపెద్దలంతా దారుణమైన పదజాలం వాడారు. ముఖ్యమంత్రి ఎన్నికల కమిషనర్ ని ఉద్దేశించి... నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని మా ప్రభుత్వం నియమించలేదు, చంద్రబాబు తన హాయాంలోనే ఎన్నికల అధికారిగా నియమించారు. రమేశ్ కుమార్ నిష్పాక్షితతో పాటు, విచక్షణను కూడా కోల్పోయినట్లు ప్రవర్తించారని మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా?'' అని ప్రశ్నించారు.