డ్రైనేజిలో గుర్తు తెలియని వ్యక్తి శవం.. షాకైన స్థానికులు

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులను ఒక్కసారిగా షాక్ గురి చేసిన ఈ ఘటన  జిల్లా కోర్ట్ సెంటర్ సాయిబాబా గుడి సమీపంలో చోటుచేసుకుంది. డ్రైనేజిలో శవం కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనపై విచారణ మొదలుపెట్టారు. 

Unidentified body recovered from drainage

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులను ఒక్కసారిగా షాక్ గురి చేసిన ఈ ఘటన  జిల్లా కోర్ట్ సెంటర్ సాయిబాబా గుడి సమీపంలో చోటుచేసుకుంది. డ్రైనేజిలో శవం కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనపై విచారణ మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కోర్ట్ సెంటర్ సాయిబాబా గుడి సమీపంలోని డ్రైనేజిలో ఒకవ్యక్తి మృతదేహం కొట్టుకురావడం స్థానికులు గమనించారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చిలకలపూడి పోలీసులు. మృతుల వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మద్యం మత్తులో డ్రైనేజీ లో పడి సదరు వ్యక్తి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

Also ReadGబెంగళూరులో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య: కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన శ్రీహర్ష... బెంగళూరులోని అమృత స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.

హాస్టల్‌లో సరైన మౌలిక వసతులు లేవని యజమాన్యంపై శ్రీహర్ష ప్రశ్నించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలేజీ యాజమాన్యం శ్రీహర్షను సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న సంఘటనలతో మనోవ్యధకు గురైన విద్యార్ధి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అతని బలవన్మరణంతో విద్యార్ధులు భగ్గుమన్నారు. కాలేజీ యాజమాన్యం తీరు వల్లే శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఆందోళనకు దిగారు.

కళాశాల, హాస్టల్‌లో సరైన నీరు, మంచి భోజనం లభించడం లేదన్న కారణంతో శ్రీహర్ష పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు అతడిపై పగ పెంచుకుని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారని.. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలేజీ యాజమాన్యం, ప్రొఫెసర్లు, విద్యార్ధులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమ కుమారుడి మరణంతో శ్రీహర్ష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

 .

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios