కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన శ్రీహర్ష... బెంగళూరులోని అమృత స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.

హాస్టల్‌లో సరైన మౌలిక వసతులు లేవని యజమాన్యంపై శ్రీహర్ష ప్రశ్నించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలేజీ యాజమాన్యం శ్రీహర్షను సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న సంఘటనలతో మనోవ్యధకు గురైన విద్యార్ధి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అతని బలవన్మరణంతో విద్యార్ధులు భగ్గుమన్నారు. కాలేజీ యాజమాన్యం తీరు వల్లే శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఆందోళనకు దిగారు.

కళాశాల, హాస్టల్‌లో సరైన నీరు, మంచి భోజనం లభించడం లేదన్న కారణంతో శ్రీహర్ష పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు అతడిపై పగ పెంచుకుని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారని.. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలేజీ యాజమాన్యం, ప్రొఫెసర్లు, విద్యార్ధులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమ కుమారుడి మరణంతో శ్రీహర్ష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Also Read: పొట్టి దుస్తులకు నో ఎంట్రీ.. కుర్తీలు వేసుకున్నా కూడా..(వీడియో)

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు విధించారు. మోకాళ్ల పైకి దుస్తులు వేసుకోని అమ్మాయిలను కాలేజీలోకి అనుమతించడం లేదు.

కాలేజీ గేటు వద్ద ఓ ఉపాధ్యాయిని నిలబడి.. వాళ్ల దుస్తులు పరిశీలించి.. సరిగా ఉన్నాయి అనుకున్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి గేటు నుంచే బయటకు పంపిస్తున్నారు.

సరే... అమ్మాయిలు నిజంగానే దుస్తులు సరిగా వేసుకోలేదా అంటే... కుర్తీలు వేసుకున్న అమ్మాయిలను కూడా వెనక్కి పంపించడం గమనార్హం. కుర్తీలు కూడా మోకాళ్ల కిందకు ఉండాల్సిందినేని నిబంధన విధించడం గమనార్హం.

కాలేజీ యాజమాన్యం మమ్మల్ని  ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ కాలేజీ విద్యార్థినులు.. వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా... ఆ వీడియో వైరల్ గా మారింది.

Also Read: విద్యార్థి హత్య.. స్కూల్లోనే పాతిపెట్టిన యాజమాన్యం

వాసుయాదవ్ అనే 12ఏళ్ల విద్యార్థి డెహ్రాడూన్ లోని  ఓ బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్నాడు. కాగా.. తన సీనియర్స్ తో జరిగిన గొడవ పెద్దదిగా మారడంతో.. వాసుని సీనియర్స్ క్రికెట్ బ్యాట్స్ తో కొట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే బాలుడిని  వైద్యులకు చూపించారు.

అయితే.. బాలుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో.. వెంటనే బాలుడి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలో పూడ్చి పెట్టారు. కేవలం బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే అనుమానంతో.. ఆ బాలుడిని సీనియర్ విద్యార్థులు దారుణంగా కొట్టడం గమనార్హం.

కాగా.. బాలుడిపై దాడి మధ్యాహ్నం జరగగా.. సాయంత్రం వరకు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదని.. ఆలస్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెబుతున్నారు. కనీసం బాలుడి పేరెంట్స్ కి కూడా ఈ విషయం స్కూల్ యాజమాన్యం తెలియజేయకపోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.