విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామకు  చెందిన యువకుడు పొన్నపల్లి జగదీష్ పిలిప్పిన్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.  అతడి మృతదేహం ఈరోజు ఉదయం నందిగామలోని స్వగృహానికి చేరుకుంది. 

నందిగామ నేతాజీ నగర్ కు చెందిన పొన్నపల్లి జగదీష్(22) వైద్య విద్యను చదివేందుకు 2016లో ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు. ప్రస్తుతం జగదీష్‌ వెటర్నరీ కోర్సులో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. 

read more  కుటుంబసభ్యులపై కేసు... మనస్తాపంతో అమరావతి రైతు మృతి

అయితే డిసెంబర్ 31వ తేదీ బైక్‌ డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు అతన్ని ఢీకొట్టింది. దీంతో జగదీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిలిప్పీన్స్ నుండి ఇరవై రోజుల తర్వాత జగదీష్ మృతదేహం నందిగామ చేరుకుంది.

జగదీశ్ మరణవార్తతో అతని కుటుంబసభ్యులు గత 20 రోజులుగా శోకసంద్రంలో మునిగిపోయారు. జగదీష్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.