రాజధాని కోసం ఉద్యమిస్తున్న మరో అమరావతి రైతు మృత్యువాతపడ్డాడు. కుటుంబసభ్యులపై పోలీసులు కేసులు పెట్టడంతె మనస్థాపానికి గురయి రైతు గుండెపోటుతో మృతిచెందారు.

అమరావతి: రాజధాని కోసం అమరావతిలో కొనసాగుతున్న నిరసనల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఓ రైతు తీవ్ర ఆందోళనకు గురయి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదం వెలగపూడిలో చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గుంటూరు జిల్లాకు అమరావతి ప్రాంతంలోని వెలగపూడి గ్రామానికి చెందిన రైతు అబ్బూరి అప్పారావు(60) నిరసనల్లో పాల్గొంటున్నారు. ఆయన కుటుంబసభ్యులు కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వారిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో తీవ్ర ఆందోళనకు గురవడంతో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితంలేకుండా పోయింది. అప్పారావు మృతితో అమరావతి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నారు. 

read more పిలిప్పిన్స్ లో తెలుగు వైద్యవిద్యార్థి మృతి...స్వగృహానికి చేరిన మృతదేహం

గుంటూరు జిల్లా తుళ్లూరుకి చెందిన మరో మహిళ కూడా శనివారం గుండెపోటుతో మృతిచెందింది. పువ్వాడ వెంకాయమ్మ(67) ముప్పై రెండురోజులనుండి అమరావతి నిరసనల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో శనివారం కూడా వెంకాయమ్మ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.

ఇప్పటికే రాజధాని కోసం అమరావతికి చెందిన పలువురు ఆత్మహత్యలు, గుండెపోటుకు గురయి మృతిచెందారు. ఇలా మరో రైతు కూడా తీవ్ర ఆందోళనకు లోనయి మృతిచెందడంతో మృతుల సంఖ్య 20కి చేరింది. 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న నిరసనల్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం వెలగపూడికి చెందిన గోపాలరావు అనే వృద్దుడు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న తన మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త విని తట్టుకోలేక గుండెపోటుకు గురయి మృతిచెందాడు.

read more కాలకేయుడిలా జగన్... సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయేలా...: వర్ల రామయ్య

రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న క్రమంలో మందడంలో ఓ రైతు స్పహ తప్పిపడిపోయాడు. ఇలా అనారోగ్యంపాలయిన రైతు సాయంత్రం మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. 

తాళ్లాయపాలెంకు చెందిన కొండేపాటి సుబ్బయ్య అనే రైతు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిరసన దీక్షలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి ఏమి తినకపోవడంతో ఆదివారం ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి రైతులు ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.