ఏపి శాసనమండలి రద్దు... ఆర్టికల్169 ఏం చెబుతోందంటే..: కనకమేడల
ఆంధ్ర ప్రదేశ్ శాాసనమండలి రద్దు నిర్ణయంపై దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నట్లు టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.
గుంటూరు: అధికారాన్ని చేపట్టిన కేవలం ఎనిమిది నెలల్లోనే దుర్మార్గంగా పాలిస్తూ రాష్ట్ర ప్రజలను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టిందని టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు, శాసన మండలి రద్దు నిర్ణయాల వెనుక పెద్దకుట్ర దాగివుందని ఆయన అన్నారు.
మరీముఖ్యంగా కౌన్సిల్ రద్దుతో రాజకీయ కుట్రకు వైసిపి తెరతీసిందన్నారు. మండలిలో బలహీన వర్గాల వారే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే జగన్ రద్దు చేయాలని భావిస్తున్నారని అన్నారు. వారికి అన్యాయం జరిగుతుంటే టిడిపి చూస్తూ ఊరుకోబోమని... ఎట్టి పరిస్థితుల్లో ఈ మండలిని రద్దు చేయకుండా అడ్డుకుంటామన్నారు.
ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దుపై తీర్మానం చేసే అధికారం మాత్రమే ప్రభుత్వానికి వుంటుందన్నారు. అయితే మండలి రద్దుకు సహేతుకంగా, న్యాయబద్దంగా కారణాలు ఉండాలని...అప్పుడే ఆమోదం పొందుతుందన్నారు.
read more ఆ బిల్లులను ఆపడంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం...: టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు
మండలిని రద్దు చేసినట్లు చెబుతున్నా ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఇంకా ఇద్దరు మంత్రులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. మండలి రద్దును కేంద్రం ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు అని తెలిపారు.
2013 నుంచి రాజస్థాన్ కౌన్సిల్ బిల్లు కేంద్రం వద్ద పెండింగులో ఉందని తెలిపారు. మండలి రద్దు, పునరుద్ధరణపై ఒక జాతీయ విధానం రూపొందించాలని ఎంపీ కనకమేడల కేంద్రానికి సూచించారు.
కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం తెలిపే వరకు మండలి కార్యకలాపాలు కొనసాగుతాయని... మండలి నిర్ణయం మేరకు సెలెక్ట్ కమిటీ ఏర్పడుతుందన్నారు. రిపోర్టు కూడా ఇస్తుందన్న నమ్మకం వుందన్నారు.
read more గ్రామాల్లో పర్యటిస్తా... ప్రజలు ఎవరైనా చెయ్యెత్తితే....: అధికారులకు జగన్ హెచ్చరిక
వైసిపికి 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపికి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పుడెందుకు హోదా గురించి మాట్లాడటం లేదని నిలదీశారు. తనపై వున్న కేసులు మాఫీ చేయించుకోవడం కోసం కేంద్రం దగ్గర... స్వంత ప్రయోజనాల కోసం పక్కరాష్ట్రం సీఎం కేసీఆర్ దగ్గర జగన్ మెడలు వంచారన్నారు.
రాజధాని మార్పు, శాసన మండలి రద్దు వంటి అనాలోచిత నిర్ణయాల గురించి ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను టిడిపి ఎంపీలంతా కలవనున్నట్లు కనకమేడల వెల్లడించారు.